ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హోరెత్తిన ఆందోళన

ABN, Publish Date - Dec 23 , 2023 | 01:04 AM

తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం అవనిగడ్డ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అవనిగడ్డలో వంటా వార్పు నిర్వహిస్తున్న అంగన్వాడీలు

11వ రోజూ కొనసాగిన అంగన్వాడీల సమ్మె

అవనిగడ్డ, డిసెంబరు 22: తమ న్యాయమైన డిమాండ్లు ఆమోదించాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం అవనిగడ్డ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం అంగ న్వాడీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అవనిగడ్డ రాజీవ్‌ గాంధీ సెంటర్‌ వద్ద మానవహారంగా ఏర్పడి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పి వెనక్కి పంపేశారు.

కూచిపూడి: మొవ్వలో శుక్రవారం అంగన్వాడీలు ర్యాలీలు, మానవహారం, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ, ప్రజా సంఘాల నేతలు వీరికి మద్దతు ప్రకటించారు.

బంటుమిల్లి: అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 11వ రోజైన శుక్రవారం బంటుమిల్లి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, అజయ్‌ఘోష్‌, మాజేటి శివ శ్రీని వాసరావు, పి.నరసింహారావు, గోరు రాజు, గంగాధర్‌, విఠలేశ్వరి, కమల, బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను మండలాల అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్లు పాల్గొన్నారు.

గుడివాడ రూరల్‌: గుడివాడలో డివిజన్‌లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - Dec 23 , 2023 | 01:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising