హెచ్‌ఐవీపై అవగాహన అవసరం
ABN, First Publish Date - 2023-12-02T01:08:31+05:30
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఏజీ అండ్ ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, రెడ్ రిబ్బన్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల వద్ద ప్రిన్సిపాల్ వి.శ్రీరామ్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు.
చినఓగిరాల(ఉయ్యూరు), డిసెంబరు 1 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఏజీ అండ్ ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, రెడ్ రిబ్బన్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల వద్ద ప్రిన్సిపాల్ వి.శ్రీరామ్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హెచ్‌ఐవీపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కళాశాల ప్రత్యేక అధికారి కె.సత్యనారా యణ అన్నారు. ఎన్ ఎస్‌ఎస్ ఆఫీసర్లు కె.శేఖర్‌బాబు, ఎండీ నూర్, అధ్యాపకులు వి.గోపీచంద్, ఆర్‌వీ శివరావు ఎన్‌ఎస్ ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
చినఓగిరాల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీపై అవగాన ర్యాలీ నిర్వహించారు. వైద్యులు తేజస్విని, ఇందిరావతి, ఎంపీహెచ్‌ఈఓ జె.చినబాబు, ఎంపీహెచ్ ఎస్ కంతేటి శ్రీనివాసరావు, జ్యోతి, హెల్త్ అసిస్టెంట్ వీవీ సత్య నారాయణ, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆకునూరులో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పెనమలూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక వీఆర్ సిద్ధార్థ కళాశాల ఎన్‌ఎస్ ఎస్ వాలంటీర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కొల్లా నరేంద్ర మాట్లాడుతూ, హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారిని ఆదరించాలని సూచించారు.
గన్నవరం : హెచ్‌ఐవీపై ప్రతి ఒక్కరూ అవగాహ న కలిగి ఉండాలని పలువురు పేర్కొన్నారు. అంత ర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా శుక్రవారం పట్టణం లో ఐసీటీసీ సెంటర్, ఛైల్డ్ ఫండ్ ఇండియా, లింక్ వర్కర్స్, ఎంజేఎం కళాశాల, తమ్మినేని నర్సింగ్ కళా శాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మానవహా రంగా ఏర్పడి నినాదాలు చేశారు. డాక్టర్ రేచల్ డాక్టర్ శ్రీదేవి, రాజశేఖర్, కిషోర్, భాస్కర్, ఎం.సదాలక్ష్మీ, కరుణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎనికేపాడు విజయ మహిళా ఫార్మసీ కళాశాల, ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్, ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినో త్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కళాశాల పరిసర ప్రాంతలైన కానూరు, నిడమానూరు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేద్దామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలత అధ్యాపకులు పాల్గొన్నారు.
హనుమాన్‌జంక్షన్ (తేలప్రోలు) : హెచ్‌ఐవీ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డీవీకే ఎస్వీ ప్రసాద్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు తేలప్రోలు, పొట్టిపాడు గ్రామాల్లో హెచ్‌ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. ర్యాలీని ప్రిన్సిపాల్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం లో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగామ్ ఆఫీసర్ డాక్టర్ వి.శ్రీహ రిబాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-12-02T01:08:33+05:30 IST