ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మూడు నెలలుగా జీతాల్లేవ్‌!

ABN, Publish Date - Dec 18 , 2023 | 01:25 AM

మూడు నెలలుగా జీతాలు లేకపోవటంతో కంచికచర్ల గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.

కంచికచర్ల పంచాయతీ కాంట్రాక్టు కార్మికుల అవస్థలు

కంచికచర్ల, డిసెంబరు 17: మూడు నెలలుగా జీతాలు లేకపోవటంతో కంచికచర్ల గ్రామ పంచాయతీ కాంట్రాక్టు కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. రేపు, మాపు అంటున్నారు తప్పితే అధికారులు జీతాలు ఇవ్వటం లేదని కార్మికులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, వాటర్‌ వర్క్సు, విద్యుత్‌ విభాగాల్లో 60 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు జీతాల కింద రూ.ఏడు లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల జీతాలు ఇప్పటి వరకు పంచాయతీ అధికారులు చెల్లించలేదు. జీతాలపై ఆధారపడి బతుకుతున్న తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు తీవ్ర ఆవేదన వెల్లిబుచ్చారు. క్రిస్మస్‌ పండుగ వస్తోందని ఈలోగా జీతాలు అందించి, తమ కుటుంబాల్లో వెలుగు నింపాలని పంచాయతీ పాలకులకు, అధికారులకు విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల్లో చెల్లిస్తాం

పంచాయతీలో నిధుల కొరత ఉంది. రెండురోజుల్లో కాంట్రాక్టు కార్మి కులకు జీతాలు చెల్లిస్తాం.

- వేల్పుల సునీత శ్రీనివాసరావు, సర్పంచ్‌

Updated Date - Dec 18 , 2023 | 01:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising