ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తండ్రిని కొట్టి, చంపి, కాల్చేసి..

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:56 AM

తండ్రిని కొట్టి చంపి, ఆపై శవాన్ని ఇంట్లోనే కొడుకు తగలబెట్టిన సంఘటన భావదేవరపల్లి మూడో వార్డులో శుక్రవారం రాత్రి జరిగింది.

ఆస్తి కోసం భావదేవరపల్లిలో కుమారుడి బీభత్సం

నాగాయలంక, డిసెంబరు 16: తండ్రిని కొట్టి చంపి, ఆపై శవాన్ని ఇంట్లోనే కొడుకు తగలబెట్టిన సంఘటన భావదేవరపల్లి మూడో వార్డులో శుక్రవారం రాత్రి జరిగింది. బండే హరి మోహనరావు(50)కు గ్రామంలో నాలుగు సెంట్ల స్థలం ఉంది. అదే స్థలంలో ఉంటున్నాడు. భార్య 20 ఏళ్ల క్రితమే చనిపోయింది. అతడికి మంజుల, పవన్‌కల్యాణ్‌ పిల్లలు. చిన్నతనం లోనే తల్లి చనిపోవటంతో పిల్లల సంరక్షణను వారి అమ్మమ్మ తీసుకుంది. హరిమోహనరావు బంధువులతో సంబంధాలు లేక ఏకాకిగా ఉంటున్నాడు. కూతురు మంజులకు అమ్మమ్మ పెళ్లి చేసి పంపింది. పాతికేళ్ల వయస్సు వచ్చి అవివాహితుడుగా ఉన్న పవన్‌కల్యాణ్‌ తాపీ పని చేస్తాడు. అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడు. హరి మోహనరావు ఉండే పూరింటికి విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. రాత్రిపూట డీజిల్‌తో దీపాన్ని వెలిగించుకుంటాడు. మద్యానికి అలవాటు పడిన పవన్‌ కల్యాణ్‌ తరచూ తండ్రి దగ్గరకు వచ్చి అతడి దగ్గర ఉన్న డబ్బు ఇవ్వాలని, ఆస్తి అమ్మేసి సొమ్ము ఇవ్వాలంటూ గొడవపడుతుం డేవాడు. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో తండ్రి ఉంటున్న పాకలోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఆస్తి విషయమై మరోసారి గొడవ పడ్డాడు. తండ్రి ససేమీరా అనటంతో ఆగ్రహంతో తండ్రిని దారుణంగా కొట్టి చం పాడు. మంచం మీద మృతదేహాన్ని పడుకోబెట్టి బట్టలను అతని మీద వేసి డీజిల్‌ పోసి నిప్పు అంటించాడు. మృతదేహం కాలుతుండగా పవన్‌ కల్యాణ్‌ పరారయ్యాడు. పాకలో మంటలను చూసిన చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి మంటలను అర్పారు. మంచం మీదున్న హరి మోహనరావు మోకాళ్ల వరకు పూర్తిగా కాలిపోయి భయానకంగా ఉన్నాడు. గ్రామస్థుల సమాచారంతో శనివారం అవనిగడ్డ సీఐ ఎల్‌.రమేష్‌, నాగాయలంక ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం ఘటనాస్థలిని పరిశీలించి హత్య వివరాలను సేకరించారు. పవన్‌ కల్యాణ్‌కు గతంలో నేర చరిత్ర ఉందని సీఐ తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నామని, హరిమోహనరావు భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:56 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising