ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ పాలనలో రోడ్డునపడ్డ ఉద్యోగులు

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:42 AM

ఏపీ సీఎం జగన్‌రెడ్డి చేతగాని పాలనతో అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

జగన్‌ పాలనలో రోడ్డునపడ్డ ఉద్యోగులు

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

విద్యాధరపురం, డిసెంబరు 27: ఏపీ సీఎం జగన్‌రెడ్డి చేతగాని పాలనతో అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. ఆటోనగర్‌ లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌ఛార్జులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. అంగన్వాడీలు, మునిసిపల్‌ కార్మికులు, ఆశా వర్కర్లు తదితర ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం సమ్మె బాట పట్టారని, జగన్‌రెడ్డి చేతగాని పరిపాలన వలన అందరూ రోడ్డున పడుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల్లో జగన్‌రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అందించనున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి బూత్‌లో ప్రచారం చేయాలన్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు విస్త్రృతంగా తీసుకు వెళ్లాలన్నారు. ఓటు వెరిఫికేషన్‌ కార్యక్ర మాన్ని కూడా నిర్వహించాలన్నారు. జనవరి 15 తరువాత రాష్ట్ర పార్టీ కొత్త అంశాలతో ప్రజల మధ్యకు రానున్నదని, ఇప్పటికే ఉన్న కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, పొట్లూరి సాయిబాబు, సొంగా సంజయ్‌ వర్మ, దోమకొండ రవి, గుమ్మడి గురుప్రసాద్‌, గోగుల రమేష్‌, పటాన్‌ హయ్యత్‌ఖాన్‌, ప్రేరేపి ఈశ్వర్‌, మాదాల చిన్ని పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising