విజయవాడలో పోలింగ్ శాతం పెంపునకు కృషి
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:45 AM
‘ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల కంటే పట్టణ నియోజకవర్గాల్లో కిందటి ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం నమోదైతే, విజయవాడలో 65 శాతం మాత్రమే నమోదైంది. విజయవాడ పశ్చిమలో 67.50 శాతం, విజయవాడ మధ్య నియోజకవర్గంలో 64.73 శాతం, విజయవాడ తూర్పులో 67.50 శాతం పోలింగ్ నమోదైంది. రానున్న ఎన్నికల్లో వీటన్నింటిలో 85 శాతం పోలింగ్ పైగా నమోదయ్యేందుకు స్వీప్ వంటి వినూత్న అవగాహన కార్యక్రమాల ద్వారా కృషి చేస్తాం.’’ అని కేంద్ర ఎన్నికల అధికారులకు(ఈసీఐ) ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు వివరించారు.
కిందటి ఎన్నికల్లో రూరల్ కంటే అర్బన్‌లో తక్కువ పోలింగ్
స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను పారదర్శకంగా నిర్వహించాం
ఫాం-6, 7, 8 దరఖాస్తులను 97.54 శాతం పరిష్కరించాం
ఈసీఐ సమీక్షా సమావేశంలో కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ /కృష్ణలంక): ‘‘ఎన్టీఆర్ జిల్లాలో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల కంటే పట్టణ నియోజకవర్గాల్లో కిందటి ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 86 శాతం నమోదైతే, విజయవాడలో 65 శాతం మాత్రమే నమోదైంది. విజయవాడ పశ్చిమలో 67.50 శాతం, విజయవాడ మధ్య నియోజకవర్గంలో 64.73 శాతం, విజయవాడ తూర్పులో 67.50 శాతం పోలింగ్ నమోదైంది. రానున్న ఎన్నికల్లో వీటన్నింటిలో 85 శాతం పోలింగ్ పైగా నమోదయ్యేందుకు స్వీప్ వంటి వినూత్న అవగాహన కార్యక్రమాల ద్వారా కృషి చేస్తాం.’’ అని కేంద్ర ఎన్నికల అధికారులకు(ఈసీఐ) ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు వివరించారు. నగరంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం సాధారణ ఎన్నికలు-2024 సన్నద్ధతసై ఈసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ దిల్లీరావు, నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా మాట్లా డారు. ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీష్ కుమార్‌వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్, సెక్రటరీ సంజయ్‌కుమార్, డైరెక్టర్ యశ్వీంద్రసింగ్, రాష్ట్ర ఎన్నికల అధి కారి ముఖేష్‌కుమార్ మీనా సమక్షంలో జిల్లాలోని పరిణామాలను వారు విరిం చారు. ఇటీవల నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్‌ఎస్‌ఆర్) - 2023 లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపైనా కలెక్టర్ వారికి వివ రించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్‌ఎస్‌ఆర్)లో భాగంగా ఈ ఏడాది అక్టో బరు 27 నుంచి డిసెంబరు 19 వరకు ఫాం- 6 కు 54,328, ఫాం- 7 కు 53,775, ఫాం-8కు 70,713 మొత్తం 1,78,816 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో 97.54 శాతం దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. ఈనెల 26లోగా మిగి లిన వాటిని పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పనలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచలను స్వీకరిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యమిచ్చి వాటిని పరిశీలించి చర్యలు తీసుకుం టున్నామన్నారు. ఫొటో, డెమోగ్రాఫిక్ సిమిలారిటీల పరిష్కారం, ఓటరు కార్డుల డిస్పాచ్, ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహణ, ఎన్నికల సిబ్బందికి శిక్షణ వివరాలు కేంద్ర ఎన్నికల అధికారులకు అందించారు.
మద్యం, డబ్బు సరఫరాపై దృష్టి పెట్టాం: సీపీ
‘‘ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాం. కిందటి ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల స్థితిగుతులను పరిశీలించాం. మద్యం రవాణా, డబ్బు తరలింపుపై దృష్టి పెట్టాం. చెక్‌పోస్టులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల దగ్గర తగిన భద్రత, పర్యవేక్షణ ఉంచాం. సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నాం.’’ అని కేంద్ర ఎన్నికల అధికారులకు విజయవాడ పోలీసుకమిషనర్ కాంతి రాణా వివరించారు.
పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండండి
2024 ఎన్నికలపై కేంద్ర ఎన్నికల అధికారుల దిశానిర్దేశం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటిఫికేషన్ వచ్చే నాటికే సమగ్ర ప్రణా ళికతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమి షనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్‌ల నేతృత్వంలోని బృందం దిశా నిర్దే శం చేసింది. పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజా స్వామ్యస్ఫూర్తి ప్రస్ఫుటించేలా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. ఎన్నికల సన్నద్ధత, నిర్వహణలో ప్రతి దశలోను అప్రమత్తత అవ సరమని, పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో ఎక్కడా ఒక్క డెత్ కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితా ప్యూరిఫికేషన్ జరగాలని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ఈవీఎంలతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రోప్లాన్‌కు అను గుణంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ అధికారులను జిల్లా అధి కారుల యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ ఆదితిసింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 12:45 AM