పండుగల సమయంలో పేదలకు కానుకలెందుకు ఇవ్వడం లేదు
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:58 AM
ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
పండుగల సమయంలో
పేదలకు కానుకలెందుకు ఇవ్వడం లేదు
21వ డివిజన్‌లో క్రిస్మస్ కానుకల పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్న
కృష్ణలంక, డిసెంబరు 23: ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదలంటే తనకు ప్రాణమని చెబు తున్న జగన్మోహనరెడ్డి పేదలకు పండుగల సమయంలో కానుకలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. 21వ డివిజన్‌లోని కృష్ణలంక పాత పోలీస్‌స్టేషన్ రోడ్డులో శనివారం బాబుష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. వై.ఎస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ఎమ్మెల్యే గద్దె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చిరువ్యాపారి పి.వి.సత్యనారాయణ క్రిస్మస్ సందర్భంగా 100 మంది పేదలకు క్రిస్మస్ కానుకలను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గద్దె అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు సేవలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిందన్నారు. చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి గురించి రాష్ట్రప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయాలన్నారు. ఫాదర్ అజ్రా, పీవీ సత్యనారాయణ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు వేములపల్లి రంగారావు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గొరిపర్తి నామేశ్వరరావు, నాయకులు గురునాథం, కేశనం భావన్నారాయణ, ఆర్.రమాదేవి, జాస్తి శివయ్య, పేరేపి ఈశ్వర్, డిప్పిలి దుర్గారావు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 12:58 AM