చిలకలపూడి పాపారావు జనసేనలో చేరిక
ABN, First Publish Date - 2023-12-03T00:36:49+05:30
మత్స్యకార నేత, సర్పం చ్‌ల సంక్షేమ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపా రావు శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమ క్షంలో పార్టీలో చేరారు.
సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
అవనిగడ్డ, డిసెంబరు 2: మత్స్యకార నేత, సర్పం చ్‌ల సంక్షేమ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపా రావు శనివారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమ క్షంలో పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి భారీ సంఖ్యలో అభిమానులతో కలిసి మంగ ళగిరిలోని పార్టీ కార్యాలయా నికి తరలివెళ్లిన పాపారావును కండువా కప్పి పవన్ కల్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు. అవనిగడ్డలో మీడియాతో పాపారావు మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, సర్పంచ్‌ల సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరును చూసి ఆయనతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమని జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.
పాపారావు వెంట భారీగా తరలివెళ్లిన మత్స్యకారులు
అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రభావశీలమైన మత్స్యకార సామాజికవర్గం నుంచి పెద్ద సంఖ్యలో చిలకలపూడి పాపారావుకు మద్ద తుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకార నేతలు వివిధ సామాజిక సంఘాల నేతలు తరలిరావటం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో వైసీపీకి భారీసంఖ్యలో ఓట్లు వేశారు. కొంతకాలంగా మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి నామమాత్రంగానైనా లేకపోవటంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పలువురు మత్స్యకార నేతలు పాపారావుతో కలసి నియోజ కవర్గంలో నిర్వహిస్తున్న జనసేన కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ వర్గాలు టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి మద్దతు గా నిలుస్తాయని రాజకీయ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
Updated Date - 2023-12-03T00:36:50+05:30 IST