ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చెన్నై స్ఫూర్తి రావాలి

ABN, Publish Date - Dec 30 , 2023 | 01:00 AM

‘‘గ్రంథాలయాల అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో కనిపించాలి. ఈ విషయంలో చెన్నైని స్ఫూర్తిగా తీసుకోవాలి. మద్రాసులో సెంట్రల్‌ లైబ్రరీ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో భారీ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ తరహా స్ఫూర్తి కచ్చితంగా రావాలి’’ అని సర్వోత్తమ గ్రంథాలయ నిర్వాహకురాలు రావి శారద అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి వచ్చిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

విజయవాడ సిటీలైఫ్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ‘‘గ్రంథాలయాల అభివృద్ధి మాటల్లో కాదు చేతల్లో కనిపించాలి. ఈ విషయంలో చెన్నైని స్ఫూర్తిగా తీసుకోవాలి. మద్రాసులో సెంట్రల్‌ లైబ్రరీ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో భారీ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ తరహా స్ఫూర్తి కచ్చితంగా రావాలి’’ అని సర్వోత్తమ గ్రంథాలయ నిర్వాహకురాలు రావి శారద అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవానికి వచ్చిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

? ప్రస్తుతం గ్రంథాలయాల పరిస్థితి ఎలా ఉంది

రాష్ట్రంలో గ్రంథాలయాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్ని గ్రంథాలయాను డిజిటల్‌ లైబ్రరీలు చేస్తున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన పని ఎక్కడా జరగడం లేదు. కొన్ని చోట్ల మాత్రమే అంతంతమాత్రంగా సాగుతోంది.

? బుక్‌ ఆన్‌ డిమాండ్‌ అమలవుతుందా

వాస్తవానికి అన్ని గ్రంథాలయాలకు ప్రతి ఏడాది కొత్త పుస్తకాలను కొనుగోలు చేయాలి. ఆవిధంగా జరగడం లేదు. బుక్‌ ఆన్‌ డిమాండ్‌ ఉంటేనే ఆ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేస్తున్నవన్నీ పోటీ పరీక్షలకు సంబంధించినవే. ఇది కాకుండా ప్రముఖ సాహిత్య పుస్తకాల కొనుగోలుకు ప్రాధాన్యమివ్వాలి

? సెంట్రల్‌ లైబ్రరీపై మీ అభిప్రాయం

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ కేంద్రంగా సెంట్రల్‌ లైబ్రరీ ఉంది. విభజన తర్వాత అందులో 40శాతం వాటా మనకు రావాలి. దానికి గురించి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు దీని గురించికి ఎందుకు ఆలోచించడడం లేదో అర్థం కావడం లేదు. ప్రతి రాష్ట్రంలో సెంట్రల్‌ లైబ్రరీలు ఉన్నాయి. మన రాష్ట్రానికి ఎలాంటి సెంట్రల్‌ లైబ్రరీ లేదు. కచ్చితంగా సెంట్రల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలి. తమిళనాడు వారికి చెన్నైలో సెంట్రల్‌ లైబ్రరీ ఉంది. ఇది కాకుండా మధురై మరో భారీ లైబ్రరీని నిర్మిస్తున్నారు. ఇలాంటి స్ఫూర్తి ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది.

? డిజిటల్‌ లైబ్రరీలు ఉన్నాయా

డిజిటల్‌ లైబ్రరీలు అన్న పదం ఒక ఫ్యాషన్‌గా మారింది. అసలు డిజిటల్‌ లైబ్రరీలు అంటే ఏమిటో అన్న వారికి, వింటున్న వారికి తెలుసా అన్న ప్రశ్న వస్తోంది. ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించినంత మాత్రాన అది డిజిటల్‌ లైబ్రరీ అయిపోయినట్టు కాదు. అన్ని పుస్తకాలను ఈ ఫార్మెట్‌లోకి మార్చాలి. ఆ పని జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.

? గ్రంథాలయాలు అభివృద్ధిలో వెనుకబడడానికి కారణం

ప్రభుత్వాలు గ్రంథాల నుంచి సెస్‌ వసూలు చేస్తున్నాయి. ఇలా వసూలు చేసిన సెస్‌ నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోతోంది. దాన్ని తిరిగి గ్రంథాలయాలకు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి చాలా దారుణం. గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయడం లేదు. నాకు తెలిసినంత వరకు ఒక్కో జిల్లాలో 60-70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో లైబ్రేరియన్‌ ఐదారు గ్రంథాలయాల బాధ్యతలను నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది.

Updated Date - Dec 30 , 2023 | 01:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising