ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Govt: ఏపీ స్టేట్ పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీ ఏర్పాటు

ABN, First Publish Date - 2023-04-27T15:17:00+05:30

రాష్ట్రంలో పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీ సభ్యులుగా రిటైర్ అయిన ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అథారిటీ సభ్యులుగా ఉదయలక్ష్మి రిటైర్డ్ ఐఏఎస్, కేవీబీ గోపాలరావు రిటైర్డ్ ఐపీఎస్, బత్తిన శ్రీనివాసులు రిటైర్డ్ ఐపీఎస్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ సభ్యులు.. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకొని పరీశీలించనున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు విశాఖపట్నంగా కేంద్రం, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు రాజమండ్రి కేంద్రం, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గుంటూరు కేంద్రం, రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా మరో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డ్ డీఎస్‌పీ, అడిషినల్ ఎస్‌పీ స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-04-27T15:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising