ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: 23న రాజధాని అమరావతి కేసుపై సుప్రీంలో విచారణ

ABN, First Publish Date - 2023-02-06T12:34:14+05:30

ఏపీ రాజధాని అమరావతి కేసుపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి కేసు (AP Capital Amaravati Case)పై ఈనెల 23న సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగనుంది. రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం (AP Government) మరోసారి విజ్ఞప్తి చేసింది. రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి (AP Government Advocate Niranjan Reddy) ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల (Amaravati Farmers) తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.

అయితే త్వరితగతిన ఈ కేసును సుప్రీంకు తీసుకువచ్చి.. రాష్ట్ర ప్రభుత్వాని (AP Govt)కి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదంటూ ఏపీ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పుపై స్టే తెచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంలో స్టే వచ్చిన వెంటనే తన మకాంను విశాఖ (Visakhapatnam)కు మార్చాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM JaganMohan Reddy) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ (Global Investment Summit)లో సీఎం మాట్లాడుతూ.. మార్చి మొదటి వారంలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగబోతోందని... అక్కడి వచ్చిన ఏపీ (Andhrapradesh)లో కూడా పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్ల (Investors)ను ఆహ్వానించారు. విశాఖ రాజధాని కాబోతోందని... తాము కూడా అక్కడకు మారబోతున్నట్లు సీఎం జగన్ చెప్పిన విషయం పెను దుమారాన్ని రేపింది. అయితే రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉండగా... విశాఖ రాజధాని అంటూ ఎలా చెబుతారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న అమరావతి రాజధాని కేసు మరోసారి సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది.

మొదటగా ఈ కేసును మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రిజిస్ట్రార్ నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ కూడా బెంచ్‌పై ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో ఈనెల 23న కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.

Updated Date - 2023-02-06T12:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising