అంగన్వాడీలపై ప్రభుత్వ తీరు దుర్మార్గం
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:56 AM
జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వ అణిచివేత ధోరణితో వ్యవహరించటం దుర్మార్గమని టీడీపీ నాయకుడు దేవినేని గౌతమ్ అన్నారు. సమస్యలు పరిష్కరించా లని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరధిక దీక్షకు శనివారం ఆయన మద్దతు పలికారు.
కంకిపాడు, డిసెంబరు 16 : జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వ అణిచివేత ధోరణితో వ్యవహరించటం దుర్మార్గమని టీడీపీ నాయకుడు దేవినేని గౌతమ్ అన్నారు. సమస్యలు పరిష్కరించా లని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరధిక దీక్షకు శనివారం ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయబద్దమైన సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వారిపై అణిచివేత ధోరణితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించలేని సీఎం ఎందుకని ప్రశ్నించారు. ఇంతటి నిరంకుశపాలన గతంలో ఎన్నడూ ఎవరూ చేయలేదన్నారు. ఈ కార్యక్రమలో టీడీపీ నాయకులు స్మిత, ఏనుగ జయప్రకాష్, బొర్రా వెంకట్, జనసేన పార్టీ నాయకులు పులి కామేశ్వరరావు, గెడ్డం నెహ్రు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:56 AM