ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అంబేడ్కర్ విగ్రహాలకు అవమానం
ABN, First Publish Date - 2023-12-11T00:46:09+05:30
‘‘రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్ర హాలకు, దళితులకు రక్షణ కరువైంది. గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక వ్యక్తి అంబేడ్కర్‌ను అవమానించేలా విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేయడం దారుణం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి’’ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ చైర్మన్ సూర్య ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాతరాజరాజేశ్వరి పేట, డిసెంబరు 10: ‘‘రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్ర హాలకు, దళితులకు రక్షణ కరువైంది. గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక వ్యక్తి అంబేడ్కర్‌ను అవమానించేలా విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేయడం దారుణం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి’’ అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్ చైర్మన్ సూర్య ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్ణానందం పేటలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం ఆయన పాలభిషేకం చేసి, నిరసన తెలిపారు. ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బైపూడి నాగేశ్వరరావు, పీవై కిరణ్, ఉండేటి జోసఫ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:46:10+05:30 IST