ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కారు తాకట్టుపెట్టిన డ్రైవర్‌పై కేసు

ABN, First Publish Date - 2023-10-30T01:03:36+05:30

వివాహ కార్యక్రమానికి కిరాయి ఉందని చెప్పి కారు తీసుకెళ్లి ఓ వ్యక్తికి తాకట్టు పెట్టిన డ్రైవర్‌పై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యాధరపురం, అక్టోబరు 29: వివాహ కార్యక్రమానికి కిరాయి ఉందని చెప్పి కారు తీసుకెళ్లి ఓ వ్యక్తికి తాకట్టు పెట్టిన డ్రైవర్‌పై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విద్యాధరపురం అరవింద వీధిలో నివాసముండే కసిరెడ్డి త్రినాథ్‌ రామకృష్ణ పరమహంస భవానీపురంలో త్రినాథ్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ నడుపుతున్నారు. సెప్టెంబరులో అమలాపురానికి చెందిన గోపాలకృష్ణ గుబ్బల డ్రైవర్‌గా చేరాడు. మొదట్లో నమ్మకంగా పనిచేశాడు. వివాహ కార్యక్రమం ఉందని రోజుకు రూ.2,500 కిరాయి ఇస్తానని చెప్పి అక్టోబరు 4న కారు తీసుకెళ్లాడు. 9 రోజులైనప్పటికీ కారు అద్దె ఇవ్వలేదు. దీంతో గోపాలకృష్ణకు ఫోన్‌ చేయగా ఇస్తానని చెప్పి కాలయాపన చేశాడు. అనుమానం వచ్చి అతని ఇంటి వద్దకు వెళ్లి విచారించగా అక్కడ లేడు. కారు కనిపించలేదు. వేరే ఇంటి ముందు కారు కనిపించడంతో ఆ ఇంటి యాజమాని సాయిని అడుగగా తనకు కారును తాకట్టు పెట్టాడని చెప్పాడు. దీంతో గోపాలకృష్ణపై కారు తనఖా పెట్టుకున్న సాయిపై బాధితుడు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గోపాలకృష్ణ, కారు తనఖా పెట్టుకున్న సాయిని శనివారం పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా, సింగ్‌నగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు పోలీసుస్టేషన్‌కు వచ్చి సాయిని పోలీసులతో మాట్లాడి విడిపించుకుని వెళ్లాడు.

Updated Date - 2023-10-30T01:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising