కొల్లు ముందస్తు బెయిల్ పిటిషన్ 15కి వాయిదా
ABN, First Publish Date - 2023-11-10T03:53:15+05:30
మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందుస్తు
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై వివరాలను సమర్పించాలని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లిఖార్జునరావు గురువారం ఆదేశాలిచ్చారు.
Updated Date - 2023-11-10T03:53:16+05:30 IST