ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్కచెల్లెమ్మలంటూనే రోడ్డున పడేశావు

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:01 PM

సమస్యల పరిష్కారం కోసం సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షలు ఆదివారం 12వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో దీక్షలు చేపడుతున్నారు.

మైదుకూరు: కొవ్వొత్తులతో అంగన్‌వాడీల ప్రదర్శన

మైదుకూరు, డిసెంబరు 24 : సమస్యల పరిష్కారం కోసం సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షలు ఆదివారం 12వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలకు టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ఆదివారం సాయంత్రం అంగన్‌వాడీ కార్యకర్తలు స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకొని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కర్యక్రమంలో అంగన్‌ వాడీ కార్యకర్తలు ఏఐటీయూసీ, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.

దువ్వూరులో...

తహసీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం అంగన్‌వాడీ కార్యకర్తలు మోకాళ్ళపై నిలబడి, కొవ్వత్తులు చేతపట్టి దీక్షలు కొనసాగించారు.

ప్రొద్దుటూరు టౌన్‌: సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు ఆదివారం సాయంత్రం క్యాండిళ్ల ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి రాజీవ్‌ సర్కిల్‌ మీదుగా శివాలయం సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మంజుల, జనసేన నాయకుడు జిలాన్‌ , అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాళ్లు విజయ, గీత, నిర్మల, రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

కొండాపురం: మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు ముఖానికి మసిపూసుకుని ఆదివారం పదమూడోరోజు కూడా తమ నిరసనను కొనసాగించారు.జీతాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి, పెంచకుండా తమకు మసి పూశారని, ముఖానికి మసి పూసుకొని, తమ నిరసన వ్యక్తం చేశారు.ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి మనోహర్‌బాబు,ఏఐటీయూసీ మండల ప్రఽధాన కార్యదర్శి వెంకటరమణ తదితరులు తమ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు తారాదేవి,జ్యోతి,పద్మ,శివపార్వతి, రామతులసి,స్వర్ణకుమారి, వెంకట సుబ్బమ్మ,విజయలక్ష్మి,వరలక్ష్మి,శిరీష తదితరులు పాల్గొన్నారు.

చాపాడు: తహసీల్దారు కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్లు 13వ రోజు ఆదివారం ధర్నా చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించేవరకు ధర్నా కొనసాగిస్తామన్నారు.

ఖాజీపేట: అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వెంటనే నెరవేర్చాలని ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగావతి అన్నారు. ఆదివారం సాయంత్రం బస్టాండు కూడలిలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పాల్గొన్నారు.

పోరుమామిళ్ల: సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సాయంత్రం పోరుమామిళ్లలోని మహాత్మాగాంధి విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భైరవ ప్రసాద్‌ , అంగన్వాడీ మండల అధ్యక్షుడు రేణుక, జ్యోతి, నారాయణమ్మ, స్వాతి, రమాదేవి, నాయకులు పాల్గొన్నారు.

బద్వేలు రూరల్‌ : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరింది. అనంతరం రాత్రి స్థానిక సీడీపీవో కార్యాలయం ఎదుట క్యాండిల్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు నాయకురాలు జయప్రద, గోపవరం మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఖదీరయ్య, డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, అంగన్వాడీ నాయకులు సత్యవతి, కళావతి, తులశమ్మ, లక్ష్మీనరసమ్మ, మహాలక్ష్మి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising