ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే మైనారిటీల సంక్షేమం

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:14 AM

రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

మూరేవాండ్లపల్లెలో టీడీపీ పథకాలపై ప్రజలకు వివరిస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

పీలేరు, డిసెంబరు 29: రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పీలేరు పట్టణంలోని పాతబ స్టాండు, బ్రాహ్మణ వీధి, పెద్దమసీదు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన శ్రేణు లతో కలిసి ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలోని మసీదుల ఇమామ్‌లు, మౌజనలకు గౌరవ వేతనాన్ని ప్రభుత్వం తరపున చెల్లించారని గుర్తు చేశారు. ఏ ఆదాయం లేని పేద ముస్లిం ఆడపిల్లల వివాహాల కోసం ‘దుల్హన’ పథకం ద్వారా ఆర్థిక సాయం చేశారన్నారు. కడప, విజయ వాడల్లో హజ్‌ హౌజ్‌లు నిర్మించడమే కాకుండా హజ్‌ యాత్రికులకు సబ్సిడీ సైతం పెంచారన్నారు. తన అన్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో పీలేరు పట్టణంలోని తిరుపతి, చిత్తూరు మార్గంలోని ముస్లింల కోసం ప్రత్యేక శ్మశాన వాటిక కోసం కేటా యించిన స్థలాన్ని అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకుని ఫ్లాట్లు వేసుకుని అమ్ముకున్నారని ఆరోపించారు. తాను చేసిన న్యాయపోరా టానికి ఆ స్థలం తిరిగి రెవెన్యూ శాఖ స్వాధీ నం చేసుకుందని, అయితే అక్కడ షాదీ మహల్‌ నిర్మిస్తామని హామీలు గుప్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంత వరకు దాని గురించి పట్టిం చుకోలేదన్నారు. అనం తరం ఆయన పీలేరు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు పులి జబ్బార్‌ సాహెబ్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతకు మునుపు పలువు రు మైనారిటీ నాయకులు కిశోర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో నాయకులు శ్రీకాంత రెడ్డి, అమరనాథరెడ్డి, కోటపల్లె బాబురెడ్డి, మల్లెల రెడ్డిబాషా, పురం రామ్మూర్తి, లడ్డూ జాఫర్‌, పోలిశెట్టి సురేంద్ర, షౌకతఅలీ, ఇస్మాయిల్‌, మహమ్మద్‌ పీర్‌, ఖాజా, బర్కతుల్లా, మల్లెల బోదేషా, లక్ష్మీకర, సాధన, పురం రెడ్డమ్మ, లక్ష్మీకాంతమ్మ, జనసేన నాయకులు కలప రవి, షఫీ, గజేంద్ర, గౌస్‌ పాల్గొన్నారు.

కలికిరిలో: మండలంలోని మునేళ్ళపల్లె పంచాయతీ మూరేవాండ్లపల్లె గ్రామంలో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారంటీ హామీ పత్రాలను శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి ఇంటింటికీ పంచిపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక యువత అలమటిస్తోందన్నారు. ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికే వైసీపీ నాయకులు పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. అరాచక పాలనకు చరమ గీతం పలకాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో కలికిరి, మునేళ్ళపల్లె, సండ్రావారిపల్లె, మర్రికుంటపల్లె సర్పంచులు ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, శశికళ, కె.జహీరా, రెడ్డిరాము, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌, నిజాముద్దీన, ప్రేమనాథ రెడ్డి, రమణయ్య, దేవేంద్ర, సతీష్‌కుమార్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, రవికుమార్‌, ప్రభాకర్‌, గంగాధరయ్య, శ్రీనివాసులు, మాలతి, అంజమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising