నేటి ఏహెచ్‌ఏ పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:07 AM
అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (ఏహెచ్‌ఏ)నియమా క పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు డీఆర్వో గంగాధర్ గౌడ్ సూచన
కడప(కలెక్టరేట్) డిసెంబరు 30: అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (ఏహెచ్‌ఏ)నియమా క పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఏహెచ్‌ఏ పరీక్ష నిర్వహణపై పశు సంవర్థక శాఖ జేడీ శారదతో కలసి పరీక్ష విధులకు కేటాయించిన చీఫ్ సూపరింటెండెంట్లు, పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్, సంబంధిత అధికారులతో డీఆర్వో మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ వారు ఆదివారం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఉదయం 9-30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలి పారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారని, పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుడా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నా రు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల్లోగా మాత్రమే అనుమతించాలన్నారు.
పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అన్ని వసతులు కల్పించాలనీ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. కడపలో 4 ప్రొద్దుటూరులో 1, చాపాడులో 1 చొప్పున మొత్తం ఆరు కేంద్రాలు ఎంపిక చేశామన్నారు కడపలో అన్నమాచార్య ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె్‌స,(ఊటుకూరు,సికెదిన్నె) ఉక్కాయ పల్లిలో శ్రీశ్రీనివా స ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాల, సికెదిన్నె మండలం తాడి గొట్లలోని కేఓఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇన్సిస్టిట్యూట్ ఆప్‌సైన్సె్‌సఅండ్ టెక్నాలజీ(కృష్ణాపురం) పొంద్ర్దుటూరులో సాయి రాజేశ్వరీ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల,(లింగాపురం) చాపాడు మండలం పల్లవోలులో చైతన్య భారతి ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల్లో కట్టు దిట్టమైన ఏర్పాట్ల నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:07 AM