ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మళ్లీ దొంగలు పడ్డారు

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:04 PM

పట్టణంలో రెండు ఆలయాల్లో మళ్లీ దొంగలు పడ్డారు. ఒక ఆల యంలో హుడీ చోరీ జరగ్గా మరో ఆలయంలో విఫలయత్నం జరిగింది. పట్టణంలో ఇలా దొంగ లు పడడం కొత్తకాదు. సరిగ్గా వారం రోజుల కిందట అంటే 22వ తేదీన సూర్యానగర్‌లో ప్ర ముఖ పారిశ్రామిక వేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు కార్యాలయంలో ఇనుపగేట్లు తొలగిం చి లోనికి ప్రవేశించి ఏమీ లేకపోవడంతో వెను దిరిగిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో రక్షణ కరవైనట్లు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇంకొం దరు పోలీసులనే అనుమానిస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాలపై పూర్తిస్థాయిలో విచారిస్తా మని ప్రకటించిన పోలీసుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. వివరాల్లోకెళితే....

ఒక ఆలయంలో చోరీ,

మరో చోట విఫలయత్నం

అయినా పట్టించుకోని పోలీసులు

రైల్వేకోడూరు, డిసెంబరు 29: పట్టణంలో రెండు ఆలయాల్లో మళ్లీ దొంగలు పడ్డారు. ఒక ఆల యంలో హుడీ చోరీ జరగ్గా మరో ఆలయంలో విఫలయత్నం జరిగింది. పట్టణంలో ఇలా దొంగ లు పడడం కొత్తకాదు. సరిగ్గా వారం రోజుల కిందట అంటే 22వ తేదీన సూర్యానగర్‌లో ప్ర ముఖ పారిశ్రామిక వేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు కార్యాలయంలో ఇనుపగేట్లు తొలగిం చి లోనికి ప్రవేశించి ఏమీ లేకపోవడంతో వెను దిరిగిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో రక్షణ కరవైనట్లు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇంకొం దరు పోలీసులనే అనుమానిస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాలపై పూర్తిస్థాయిలో విచారిస్తా మని ప్రకటించిన పోలీసుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. వివరాల్లోకెళితే....

పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడి హుండిలో ఉన్న డబ్బును చోరీ చేశారని స్థానికులు తెలిపారు. శుక్రవారం అర్చకులు బీఎస్‌ శర్మ ఆలయాన్ని తెరిచేందుకు వెళ్లగా హుండీ వద్ద చిందరవంద రగా పడి ఉండడాన్ని చూసి అవ్వాక్కయ్యారు. దీంతో ఆలయ నిర్వాహకులకు విషయాన్ని తెలి పారు. ఆలయ నిర్వాహకులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హుండీని కట్టుది ట్టంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నా రు. ఇరిగేషన్‌ కార్యాలయానికి సమీపంలో ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు భాగాన ఉన్న తాళాలను తొలగించారు. హుండీకి ఉన్న తాళాలు రాకపోవడంతో చోరీ విఫల య త్నం అయిందని అర్చకులు బీఎస్‌ శర్మ తెలిపా రు.

ఆలయం సమీప దుకాణంలో దొంగలు చొర బడి రూ. 2000 నగదు ఎత్తుకెళ్లారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త మాచినేని విశ్వశ్వేరనాయుడు కార్యాలయంలో రెండు పర్యాయాలు దొంగలు పడి తాళాలు పగులగొట్టారు. కార్యాలయంలో ఏ మీ లభించకపోవడంతో వెళ్లిపోయారు. మూడు నెలల కిందట రైల్వేకోడూరు రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద చోరీ విఫల యత్నం జరిగింది. పక్కనే ఉన్న ఎలక్ట్రికల్‌ దుకాణంలో చోరీ చేశారు. రాత్రి వేళ పోలీసుల గస్తీ లేకపోవ డంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోం దని దుకాణదారులు వాపోతున్నారు. దొంగలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, తెలిసిన వాళ్లేనా, దూర ప్రాంతాల నుంచి వస్తు న్నారా అనేది అంతుచిక్కకుండా ఉంది. ఎంత గట్టి తాళాలనైనా దొంగలు చాకచక్యంగా పగుల గొడుతున్నారని దుకాణ దారులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. పోలీసులు దొంగతనాలను అదుపులోకి తీసుకోవాలని, రాత్రి వేళ గస్తీ ము మ్మరం చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం

డాక్టర్‌ నాయక్‌, రైల్వేకోడూరు ఎస్‌ఐ-1

పట్టణంలో దొంగత నాలను అరికట్టేందు కు ప్రత్యేక నిఘా ఉం ది. రాత్రి వేళగస్తీ చేస్తున్నాను. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నాము. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమె రాలు లేవు. దొంగల సంచారం తెలుసుకుంటాం. ఇకపై రైల్వేకోడూరులో దొంగతనాలు జరగకుం డా చూస్తాం. ప్రజలు పోలీసులకు సహకరిం చాలి. ఇళ్లు, వ్యాపార దుకాణాల వద్ద సీసీ కెమె రాలను ఏర్పాటు చేసుకుంటే జరుగుతున్న సం ఘటనలపై మరింత నిఘాలు పెట్టే అవకాశాలు ఉంటాయి.

Updated Date - Dec 29 , 2023 | 11:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising