ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్ర భవిష్యత్తు టీడీపీతోనే

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:09 AM

మేయర్‌ సురే్‌షబాబు సొంత డివిజన్‌లోనే రోడ్ల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాధవీరెడ్డి, జనసేన జిల్లా కన్వీనరు సుంకర శ్రీనివాసులు ఆరోపించారు.

రోడ్ల పరిస్థితిని చూపిస్తున్న మాధవీరెడ్డి

మేయర్‌ డివిజన్‌లోనే... రోడ్డు ఇలా....

వైసీపీ ప్రభుత్వం విఫలం

పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 30: మేయర్‌ సురే్‌షబాబు సొంత డివిజన్‌లోనే రోడ్ల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాధవీరెడ్డి, జనసేన జిల్లా కన్వీనరు సుంకర శ్రీనివాసులు ఆరోపించారు. శనివారం కడప నగరం 4వ డివిజన్‌ శాంతినగర్‌లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించారు. వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలిపారు. మేయర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 4వ డివిజన్‌లోనే ఇలాంటి దుర్భర పరిస్థితి ఉందంటే మిగతా డివిజన్ల పరిస్థితి ప్రజలకు ఇట్లే అర్ధమవుతుందన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు లేక డ్రైనేజీ లేక రోడ్లపైనే మురుగునీరు చేరి దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికులు తాము వైసీపీకి ఓట్లు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తామని స్థానికుల కు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు శివకొండారెడ్డి, యాటగిరి రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని టీడీపీ సీనియర్‌ నేతలు అమీర్‌బాబు, అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి విమర్శించారు. శనివారం బాబుష్యూరిటీ భవిష్యత్తుగ్యారం టీలో భాగంగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి వ్యాపారులను పలకరిస్తూ కరపత్రాలు అందించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, నగర ఉపాధ్యక్షుడు కొండాసుబ్బ య్య నేతలు లింగాల శివశంకర్‌రెడ్డి, జయరామిరెడ్డి, ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్‌యాదవ్‌, ఇమ్రాన్‌, అమరావతి, స్వర్ణలత, నిర్మ ల, అరుణ, మాధవి, మల్లేశ్వరి, ఉమాదేవి, కరీమున్నీసా, బీబీ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తు టీడీపీదే

వేంపల్లె, డిసెంబరు 30: రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగిస్తుందని భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తెలిపారు. వేంపల్లెలో బాబు ష్యూరి టీలో భాగంగా శనివారం సా యంత్రం పలువురి ఇళ్ల కెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయ న మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మునిరెడ్డి, మైనార్టీ కన్వీనర్‌ వలి, అలిరెడ్డిపల్లె బాలకృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు వీరభ ద్ర, మడక శ్రీనివాసులు, మల్లికార్జున, మహమ్మద్‌, రమేష్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బాగు కోసం టీడీపీని గెలిపించండి

చెన్నూరు, డిసెంబరు 30: రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగు పడాలన్నా టీడీపీని గెలిపించాలని కొక్కిరాయపల్లె సీనియర్‌ నేత పాలగిరి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ సూర్యనారాయణ అన్నారు. కొక్కిరాయపల్లెలో శనివారం బాబుతో భవిష్యత్తు గ్యారం టీ నిర్వహించారు. వారు ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ ఆరు మేనిఫెస్టోలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఐదేళ్లు పూర్తవుతున్న ఈ వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అందుకే టీడీపీని గెలిపించాలని చంద్రబాబు సీఎం అయితే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు, ప్రతి ఊరు అభివృద్ధిపథంలో నడిపిస్తాయని వివరించారు.

Updated Date - Dec 31 , 2023 | 12:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising