ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వం

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:12 PM

రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వం కొనసాగుతుందని ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యా యం జరగలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా కోఆర్డినేటర్‌ సుంకర శ్రీనివాస్‌ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అన్నివర్గాల కు న్యాయం చేస్తామని హా మీ ఇచ్చారు.

ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

అన్నివర్గాలకు తీరని అన్యాయం

సమ్మెకు టీడీపీ, జనసేన మద్ధతు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 26: రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వం కొనసాగుతుందని ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యా యం జరగలేదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా కోఆర్డినేటర్‌ సుంకర శ్రీనివాస్‌ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అన్నివర్గాల కు న్యాయం చేస్తామని హా మీ ఇచ్చారు. కడప కార్పొరేషన్‌ ఎదుట మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన సమ్మెకు టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించాయి. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. మాట తప్పం మడమ తిప్పం అని చెప్పిన జగన్‌రెడ్డి ప్రతి విషయంలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నివర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. టీడీపీ ప్ర భుత్వం వస్తే అన్నివర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షుడు సుంకర రవి, సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్నికలకు ముం దు ఇచ్చిన హమీలైన కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు పర్మినెంటు చేస్తామని పనికి సమాన వేతనం, మున్సిపల్‌ రంగంలో ఇంజనీరింగ్‌ కార్మికుల కు రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌ పబ్లిక్‌హెల్త్‌ చెత్త తరలించే వాహన డ్రైవ ర్లు యూజీడీ, మలేరి యా పార్కుల్లో పనిచే సే కార్మికులకు ఆక్యుపెషన్‌ అలవెన్స్‌ ఇస్తామన్నారు. జీఓ ఆర్‌టి నెం.38 సవరించి కార్మికశాఖ ప్రతిపాదన మే రకు వాటర్‌ సప్లై, వర్క్‌ఇన్స్‌పెక్టర్లు, అండర్‌గౌండ్‌ డ్రైనేజీ కార్మికుల సమస్యలు, హామీ ఇచ్చిన ప్రతి సమస్య నెరవేర్చాలని కోరారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, అన్నమయ్యజిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్మిక నేతలు గోపి, కిరణ్‌, ఆనంద్‌, నాగరాజు, కేశవ శివ, దస్తగిరి, సాయమ్మ. కొండమ్మ, పెద్దమ్మ, కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising