మొక్కజొన్న పంటపై విషప్రయోగం
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:43 PM
పీటీఎంలో ఓ రైతు సాగుచేసిన మొక్క జొన్న పంటపై విషప్రయోగం జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది.
పెద్దతిప్పసముద్రం డిసెంబర్ 18 : పీటీఎంలో ఓ రైతు సాగుచేసిన మొక్క జొన్న పంటపై విషప్రయోగం జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది. భాదిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని నవాబు కోట పంచాయతీ గుగ్గిళ్లపల్లెకు చెందిన గోవిందరెడ్డి సన్నకారు రైతు. తనకున్న ఎకరా పొలంలో రూ. 30 వేలు ఖర్చు చేసి మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పంట బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మొక్కజొన్న పంటపై గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారు. పెట్రోల్ పంపుతో కొడితే శబ్దం వస్తుందన్టి బ్యాటరీ పంపులో గడ్డిని చంపేందుకు వినియోగించే మందును నింపుకుని మొక్కజొన్న పంటపై రాత్రిపూట పిచకారీ చేశారు. దీంతో ఎంతవరకు మందు పడిందో అంతభాగం పూర్తిగా చనిపోయిందని రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ మేరకు పోలీసులకు పిర్యాదు చేశాడు. కాగా గ్రామంలో పంటపై విషప్రయోగం సంఘటన చర్చనీయాంశమైంది.
Updated Date - Dec 18 , 2023 | 11:43 PM