ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గత వైభవాన్ని తలపించేలా మహాసభలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:31 PM

జిల్లాలో మహా సభ ల గతవైభవాన్ని తలపించేలా కడప సభా భవనంలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు (షేక్‌ హుసేన్‌) సత్యాగ్ని ప్రక టించారు.

ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు

రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు సత్యాగ్ని

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 17: జిల్లాలో మహా సభ ల గతవైభవాన్ని తలపించేలా కడప సభా భవనంలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు (షేక్‌ హుసేన్‌) సత్యాగ్ని ప్రక టించారు. ఆదివారం సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో జిల్లా రచయితల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 36 ఏళ్ల తరువాత డిసెంబరు 23, 24 తేదీల్లో కడప సభా భవనంలో మహాసభలు నిర్వహిస్తామన్నారు. గ తంలో నిర్వహించే సమావేశాలకు ఇతర ప్రాంతాల నుంచి మహాకవులు, రచయితలు కడప గడపకు ఆహ్వానించి వారిని తగురీతిన సత్కరించేవారమన్నారు. ఆ వైభవాన్ని పునరావృ తం చేసేలా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా అధ్యక్షులు ప్రొఫెసరు మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు తెలుగుభాషా సాహిత్యాలకు జిల్లా ఎనలేని సేవలు చేసిందని తొలి శాసనం, తొలి ప్రబంధ కర్త పోతులూరి వీరబ్రహ్మం, వేమన వంటి మహానుభావులు పుట్టినగడ్డ కడప అని అన్నారు. కడ ప జిల్లా చరిత్ర సంస్కృతి, సాహిత్యం కళల వైభవాన్ని యువతకు చేరువ చేయాలన్న సంకల్పంతో మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం డాక్టర్‌ వెల్లాల వెంకటేశ్వరాచారి రచించిన సోమిశెట్టి సరళగానం చేసిన బాబ్‌ స్టూడియో సంగీ త సాకారంతో రూపొందించిన కడప వైభవం చాటే ఉద్దీపన గీతాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి, కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి, కోశాధికారి డాక్టర్‌ కొప్పోలురెడ్డి, శేఖర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ వెల్లాల వేంకటేశ్వరచారి, డాక్టర్‌ పాలెం వేణుగోపాల్‌, సీవీ సాయిప్రసాద్‌, అణగూరు చంద్రశేఖర్‌రెడ్డి, భూమిరెడ్డి స్వరూపరాణి, రాజగోపాల్‌రెడ్డి, తుమ్మలూరు సురేశ్‌ బాబు, పొదిలి నాగరాజు, కోడూరు స్వాతంత్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising