ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ...

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:00 AM

దేవుడా, కష్టపడి పనిచేస్తున్న తమకు న్యాయం జరిగేలా, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించు స్వామి అంటూ అంగన్వాడీలు సాష్టాంగ నమస్కారాలు చేశారు.

మదనపల్లెలో అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా పాల్గొన్న యూటీఎఫ్‌ నాయకులు

ఉధృతమవుతున్న అంగన్వాడీల సమ్మె వినూత్నంగా నిరసనలు తెలియచేస్తున్న అంగన్వాడీలు

మదనపల్లె టౌన, డిసెంబరు 17: దేవుడా, కష్టపడి పనిచేస్తున్న తమకు న్యాయం జరిగేలా, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించు స్వామి అంటూ అంగన్వాడీలు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆదివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సెంటర్లను బలవంతంగా తెరిపించిన ప్రభుత్వం, సచివాలయ ఉద్యోగులు అక్కడ పిల్లలకు ఏమాత్రం సేవలు అందించడం లేదన్నారు. ప్రజల నుంచి కూడా తమ సమ్మెకు మద్దతు ఉందని, అసలు సెంటర్లకు పిల్లలను పంపడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ అసోసియేషన నాయకులతో చర్చలు జరిపి, తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకురాళ్లు మధురవాణి, గంగాదేవి, సుజన, అఖీరున్నీసా, గీత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

పాదయాత్ర సందర్భంగా సీఎం జగనమోహనరెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని యూటీఎఎప్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతుగా యూటీ ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు రవిప్రకాష్‌ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలో లాగా రూ.26వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సెంటర్ల తాళాలు పగులకొట్టడం దారు ణమని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షు డు సుధాకర్‌నాయుడు, కార్యదర్శి పురం వెంకటరమణ, భానుమూర్తి, గాలి రవీంద్ర, మల్లేశ్వరబాబు, గురునారాయణాచారి పాల్గొన్నారు.

అంగన్వాడీల ఆందోళనకు చిన్నారుల తల్లుల మద్దతు

వాల్మీకిపురం, డిసెంబరు 17: అంగన్వాడీల సమ్మెకు చిన్నారుల తల్లులు మద్దతు నిచ్చి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వం అంగనవాడీ కార్యకర్తల న్యాయమైన డి మాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల వద్ద హాజరై అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపారు. సీఎం జగన అంగన్వాడీల విషయంలో స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నా రు. పట్టణ సమీపంలోని పింగాణి ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉండే అంగన్వా డీ కేంద్రం ఎదుట పిల్లలతో తల్లులు, గర్భవతులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారమయ్యే దాకా తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో యూనియన లీడర్లు భూకౌలేశ్వరి, చంద్రావతి, ప్రసన్న, లక్ష్మీనరసమ్మ, అమ్మాజీ, నజీమున్నీసా, అన్నపూర్ణ, గులాబ్‌జాన, వివిధ మండలాల అంగనవాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

బి.కోత్తకోటలో : తమ డిమాండ్ల సాధన కోసం గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. బి.కొత్తకోట పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద సమ్మెలో పాల్గొన్న కార్యకర్తలు ఆదివారం ఆయా గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాల వద్ద లబ్ధిదారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు మా ట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను పంపడం లేదన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising