ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడుదాం

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:24 AM

వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచ కపాలనకు చరమగీతం పాడుదామని తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

తంబళ్లపల్లె/కురబలకోట, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచ కపాలనకు చరమగీతం పాడుదామని తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. బుధవారం తంబళ్లపల్లెలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఒక్క అవకాశం అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోగా ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో అరాచకాలు, భూకబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీ-జనసేన నాయకులు కలసికట్టుగా పనిచేస్తూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తంబళ్లపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయడానికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి పర్వీనతాజ్‌, నియోజకవర్గ పరిశీలకుడు గురువారెడ్డి, జనసేన తంబళ్లప ల్లె ఇనచార్జ్‌ సాయినాథ్‌, టీడీపీ మహిళా నాయకురాలు సిద్దమ్మ, తంబళ్లపల్లె గ్రామా ధ్యక్షుడు సాంబశివ, సోముశేఖర్‌, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, ఉత్తమ్‌రెడ్డి, తాతిరెడ్డి, టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. కాగా కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలోరాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌, నియోజ కవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి, ఉపాధ్యక్షుడు సుదర్శనరెడ్డి, మండల కన్వీనర్‌ వైజీ సురేంద్ర, రమణ, మాజీ ఎంపీపీలు భూమిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising