కళ్లు తెరిపిద్దాం.. నిజాన్ని గెలిపిద్దాం
ABN, First Publish Date - 2023-10-30T00:13:28+05:30
అధికార మదంతో కళ్లు మూసుకు పోయిన వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించడంతోపాటు నిజాన్ని గెలిపి ద్దామని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి.
కళ్లున్న కబోదిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ కళ్లకు గంతలతో టీడీపీశ్రేణుల నిరసన చంద్రబాబు అరెస్టు ముమ్మాటికి అక్రమమంటూ ఆగ్రహం నిజమే గెలుస్తుందని స్పష్టం
మదనపల్లె టౌన, అక్టోబరు 29: అధికార మదంతో కళ్లు మూసుకు పోయిన వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించడంతోపాటు నిజాన్ని గెలిపి ద్దామని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఆదివారం రాత్రి పట్టణంలోని బెంగళూరు బస్టాండు వద్ద మదనపల్లె టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ ఆద్వర్యంలో టీడీపీ నాయ కులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడు తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కళ్లున్న కబోది లా వ్యహరిస్తోందని ధ్వజమెత్తారు. నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన చంద్రబాబుపై అవినీతి కేసు పెట్టిన, జగన కళ్లు తెరిపించాలన్నారు.. కార్యక్రమంలో దొమ్మలపాటి యశశ్విరాజ్,, టీడీపీ మండల అద్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, కత్తి లక్ష్మన్న, చంద్రశేఖర్, వెంకటరమణారెడ్డి, సోమశేఖర్, దాదాపీర్ ఖాన పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద టీడీపీ పాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. షాజహానబాషా మాట్లాడుతూ జగన ఆరాచక పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన, టౌనబ్యాంకు మాజీ చైర్మన నాదెళ్ల విద్యాసాగర్, శివప్రసాద్ నవీనచౌదరి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక నీరుగట్టువారిపల్లెలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొరస్వామినాయుడు, ఎం.ప్రభాకర్, ఉమేష్, అరుణ్‌తేజ్, మహబూబ్ ఖాన పాల్గొన్నారు.
పీలేరులో: వ్యక్తిగత కక్ష, అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించడమే కాకుండా అక్రమ నిర్బంధానికి గురైన చంద్రబాబును విడిపించి నిజాన్ని గెలిపిద్దామని పీలేరు మం డల టీడీపీ శ్రేణులు నినదించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ‘కళ్లు తెరిపిద్దాం...నిజాన్ని గెలిపిద్దాం’ కార్యక్రమాన్ని పీలేరు మండల టీడీపీ శ్రేణులు ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.15 వరకు పార్టీ కార్యా లయంలో కళ్లకు గంతలు కట్టుకుని చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి సుర క్షితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లడ్డూ జాఫర్, వారణాశి శ్రీకాంత రెడ్డి, పురం రామ్మూర్తి, అమరనాథరెడ్డి, లక్ష్మీకర, షౌకతఅలీ, రహంతుల్లా, సూరి, అత్తార్ చాను, కప్పరం చంద్రయ్య, రెడ్డిముని, మహమ్మద్ పీర్, ఆబిద్ అలీ, సుభాష్, బాబ్జీ రెడ్డి పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: నిజం గెలవడం.. నారా చంద్రబాబునాయుడు నిప్పు లా బయటకు రావడం ఖాయమని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్య క్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. స్థానిక హరిమందిరం వద్ద ఆదివారం సాయంత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని కాగడాలు ప్రదర్శిస్తూ కళ్లు తెరిపిద్దాం అంటూ ..నిజం గెలవా లంటూ నినాదాలతో హోరెత్తించారు. మండలంలోని చింతపర్తి గ్రామం లో సర్పంచ మహిత ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిజం గెల వాలి..రాష్ట్రంలో దుష్ట పాలన అంతం అవ్వాలని నినాదాలతో హోరెత్తిం చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు పీవీ నారాయణ, కోసూరి రమేష్, చంద్రమౌళి, రాజేంద్రా చారి, వల్లిగట్ల వెంకటరమణ, పీలేరు పార్టీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ బాషా, మురళి, ద్వారకనాథరెడ్డి, శేషాద్రిరెడ్డి, డిష్ బ్రదర్స్, బొక్కసం రామకృష్ణ, చాను, కువైట్ సయ్యద్‌బాషా, జంషీద్, షబ్బీరుల్దాఖాన, టీస్టాల్ సయ్యద్, సాదిక్, గుడ్రెడ్డి చంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, కువైట్ ఆది, భాస్కర్, కేవీ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, లంకిపల్లె మధుసూదననాయుడు, జావీ ద్, గాంధీపేట రెడ్డి, రామకృష్ణ, ఆనంద్, ఆదినారాయణ పాల్గొన్నారు.
ములకలచెరువులో: టీడీపీ అధినేత నారా చంద్రబాబుకునాయుడికి మద్దతుగా ములకలచెరువులో ఆదివారం రాత్రి టీడీపీ శ్రేణులు న్యా యం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షు డు పాలగిరి సిద్ధా, నాయకులు కేవీ రమణ, కేశవులు, సుధాకర్‌నా యుడు, నారాయణస్వామి, షామీర్, కాలా మహేష్, రెడ్డెప్ప, శివన్న, విజయ్‌కుమార్, నాగేంద్ర, గాలి నారాయణ, రమణమూర్తి, ఆదిమూర్తి, గంగాద్రి, శ్రీనివాసులు, నాగమునినాయుడు, సురేంద్ర కళ్ళకు నల్ల రిబ్బన్ను కట్టుకుని నిరసన చేపట్టారు. అలాగే బురకాయలకోటలో టీడీపీ నేతలు ముత్తకూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, విజయ్ కుమార్, శ్రీనివాసులునాయుడు, రిజ్వాన కార్యక్రమాన్ని చేపట్టారు.
మదనపల్లె: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్ర మ అరెస్టును నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి జనసేన నేత లు నిజమే గెలవాలి కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇందులోభాగంగా స్థానిక కమ్మవీఽధిలో జరిగిన కార్యక్ర మంలో నియోజకవర్గ జనసేన ఇనచార్జి గంగారపు స్వాతి, పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామ్‌దాస్‌చౌదరి పాల్గొన్నారు.
రామసముద్రంలో:టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయు డు అక్రమంగా అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదివారం రాత్రి 7గంటల నుంచి 7.05నిమిషాలకు మండల టీడీపీ అధ్యక్షుడు విజ య్‌కుమార్‌గౌడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ కూడలిలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సైకో పోవాలి సైకిల్ రావాలి, న్యాయ దేవత కళ్లు తెరవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకు లు కృష్ణంరాజు, నారాయణరెడ్డి, ప్రశాంతరెడ్డి, శ్రీనాథ్, శ్రీకాంత, జయకు మార్‌శెట్టి, బండ్ల జనార్దన, చెంగారెడ్డి, శివ, కృష్ణమూర్తి, రాజేష్, వెంకట రమణ, శివశంకర్, విశ్వనాథ్, నారాయణరావు పాల్గొన్నారు.
గుర్రంకొండలో:గుర్రంకొండ, చెర్లోపల్లె, తరిగొండ గ్రామాల్లో టీడీపీ శ్రేణులు కళ్లకు నల్ల గుడ్డను కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు జగదీష్‌కుమార్, నౌషాద్ అహ్మద్, చలమా రెడ్డి, ఎల్లుట్ల మురళీ, ఏజాజ్ అహ్మద్, ఇక్బాల్ ఖాసీం, మౌలా, సుబ్బ రాజు, తారక, విజయ్, షఫీ, చలపతి, రంజిత, రామయ్య, బాబాజన, చిన్నరెడ్డి, రమణ, తన్వీర్, తదితరులు పాల్గొన్నారు.
కలకడలో:నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు కళ్లకు గంతలు కట్టుకున్ని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బి.విస్వామి, ఆదినారాయణచారి, వెంకటరెడ్డి, రెడ్డెప్ప, పిచ్చెన్న, నాగరా జ, కరీముల్లా, జిలానీ, నౌషాద్, ఇమ్రాన, తాహీర్‌లు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్ర మ అరెస్టుకు నిరసనగా ఆదివారం సాయంత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కళ్లు తెరిపిద్దాం కార్యక్రమం నిర్వహించారు. కోసువారిపల్లె పంచాయతీ దేవరబురుజులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహి ళలు కళ్లకు గంతలు కట్టుకుని నిజం గెలవాలి-కళ్లు తెరిపిద్దాం అంటూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, తెలుగు యువత మండలాధ్యక్షుడు గంగరాజు, మహిళా నాయకురాలు సిద్ధమ్మ, భవానీ, సోమశేఖర్, క్లస్టర్ ఇనచార్జ్ బేరి శీన, వేమనారాయణ, ఎర్రంరెడ్డి, మురళి, ఉదయ్, చిన్నతోటప్ప, రమణయ్య పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు బయటకు రావాలంటూ బి.కొత్తకోటలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి ఎస్‌ఎం పర్వీనతాజ్ పోకనాటి వీధిలో, మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి బస్టాండ్ కూడలిలో పార్టీ నాయకులు కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భం గా పర్వీనతాజ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగనాసురుడి కళ్లు తెరిపిద్దామన్నారు. కార్యక్రమాల్లో చావిడి కిట్టన్న, ప్రభాకర, పద్మనాభ, షపీఉల్లా, ఎండీ మస్తాన, డేరంగుల నారాయణ, షమీఉల్లా, భాస్కర్‌రెడ్డి, శిల్పాఆంజనేయులు, రియాజ్ పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: మండలంలో ఆదివారం రాత్రి కళ్ళకు గంతలు కట్టుకొని టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రిమాండ్ నుంచి త్వరగా బయటకు రావాలని మద్దతు గా నిజం గెలవాలని కార్యక్రమంలో భాగంగా పెద్దమండ్యం, పాపేపల్లి తదితర గ్రామాలలో టీడీపీ నాయకులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర టీడీపీ ఎస్టీసెల్ కార్యదర్శి మనోహర్ నాయక్, టీడీపీ నాయకులు గంగాధర, మహేశ్వర, పవన, రెడ్డిబాష, మల్లికార్జున, నూరుసాబ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-30T00:13:28+05:30 IST