రైతులను వంచించేందుకే భూ హక్కు చట్టం
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:19 AM
భూహక్కు చట్టం రైతులను వంచిం చేదుకే అని సీనియర్ న్యాయవా దులు గణపతి, శివకుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కోర్టు ఎదుట న్యా యవాదులు నిర్వహిసు ్తన్న రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.
మదనపల్లెటౌన, డిసెంబరు 22: భూహక్కు చట్టం రైతులను వంచిం చేదుకే అని సీనియర్ న్యాయవా దులు గణపతి, శివకుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కోర్టు ఎదుట న్యా యవాదులు నిర్వహిసు ్తన్న రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ భూహక్కు చట్టం ద్వారా వేలాది మంది రైతుల భూ రికార్డు లు తారుమారు అవుతాయన్నారు. దీంతో అధికారుల చలవ ఉండే వర్గం లాభాల్లోకి వెళితే, అసలైన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. న్యాయ వాదుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా మద్దతు పలికారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలపై బలవంతం గా చట్టాలు రుద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత మార్పురి సుధాకర్ నాయుడు, సంయుక్త కార్యదర్శి సోమశేఖర్, న్యాయ వాదులు కాలం రఘుపతి, రఫీ, సంపత, ఆర్.వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గోపాల కృష్ణ, సురేష్‌బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:19 AM