ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నేతల కబ్జా పర్వం: రితీష్‌

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:13 PM

మండలంలోని రజకుల ఇంటిస్థలాలతోపాటు, బద్వేలు - పోరుమామిళ్ల రోడ్డులోని ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని టీడీపీ యువ నాయకుడు రితీష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

పాదయాత్ర చేస్తున్న రితీష్‌కుమార్‌ రెడ్డి

బి.కోడూరు, డిసెంబరు 18: మండలంలోని రజకుల ఇంటిస్థలాలతోపాటు, బద్వేలు - పోరుమామిళ్ల రోడ్డులోని ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని టీడీపీ యువ నాయకుడు రితీష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పాయలకుంట్ల, రామచంద్రపురం, ఆనంవారిపల్లె, రామ సము ద్రం, అక్కుపాలెం, బి.కోడూరు, మరాటిపల్లె గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. బి.కోడూరు నాలుగురోడ్ల కూడలిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రీసర్వే చేయించి భూమి లేని పేదలకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. చెరువులోని ఒండ్రు మట్టిని చేలకు తోలుకునే రైతులపై కేసులు పెడుతున్నారన్నారు. సగిలేరు డ్యాంకు గేట్లు బిగించడానికి ఐదేళ్లు కాలయాపన చేసి, సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేశారన్నారు. టీడీపీ హయాంలో మున్నెల్లి చెరువుకు లిఫ్ట్‌ఇరిగేఫన్‌ ఏర్పాటు చేశారన్నారు. శిరిగిరిపల్లె, గుంతపల్లె, బికోడూరు, నరసింహాపురం, మేకవారిల్లె, పెదుళ్లపల్లె ప్రభలవీడు చెరువుల మరమ్మత్తులకు వరల్డ్‌ బ్యాంకు నిధులు మంజూరు చేయించగా, వైసీపీ నేతలు మట్టి పనులతో ఆపేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక రోడ్డు కానీ, ఒక వీధి బల్బు వేసిన పాపాన పోలేదన్నారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను మూడు రోజుల్లోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు రామ చంద్రరెడ్డి, గోడి రమణారెడ్డి, ఓ.రమణారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, అమర్‌నాథరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, మనో హర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, జయరామిరెడ్డి, రాఘవరెడ్డి, పవన్‌, దుగ్గిరెడ్డి, బా లయ్య, టీడీపీ సర్పంచ్‌లు గోడి లక్ష్మిదేవి, కేశవ, ప్రభావతి, వెంగల్‌ రెడ్డి, కె. ప్రసాద్‌, మస్తాన్‌బాబు, మిత్తికాయల సునీత, రమణ, ఝాన్సీ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising