వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
ABN, First Publish Date - 2023-10-30T23:49:54+05:30
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావిం చిన భార్య, ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఉదందమిది.
మదనపల్లె, అక్టోబరు 30: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావిం చిన భార్య, ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఉదందమిది. బాధితుని కు టుంబసభ్యులు, వనటౌన సీఐ మహబూబ్ బాషా కథనం మేరకు..మదనపల్లె పట్టణం రామిరెడ్డిలేఅవుట్‌లో నివాసముంటున్న వెంకటశివ, రమణమ్మ లు భార్యభర్తలు. వారి స్వగ్రామం కలకడ మండలం సింగన ఒడ్డుపల్లె. ఉపాధి నిమిత్తం ఏడాదన్నర క్రితం ఆకుటుంబం మదన పల్లెకు వచ్చింది. ఈక్రమంలో ఈ దంపతులు టమెటా మార్కెట్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇం దులో భాగంగా ఆదివారం రాత్రి..భర్త వెంకటశివ యధావిధిగా టమో టా మార్కెట్‌కు కూలీ పనులకు వెళ్లాడు. అంతలో భార్య రమ ణమ్మ..అదే ప్రాంతానికి చెందిన ప్రియుడు గగనతో ఉండ గా రాత్రికి ఇంటికి వచ్చిన భర్త గుర్తించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదోపవాదనలు చోటు చేసుకోవడంతో ఘర్షకు దారి తీసింది. దీంతో ఇంట్లోని రోకలితో భర్త వెంకటశివ తలపై కొట్ట డంతో అతను అక్క డిక్కడే పడిపోయాడు. కింద పడిన ఆయ న్ని..భార్య ప్రియుడు గగన..వైరుతో గొంతు బిగించి చంపేశాడు. దీంతో కంగారు పడిన ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్లు చిత్రీకరించారు. అంతలో..తన భర్త తాగి కింద పడిపో యాడని, ఆసుప త్రికి తీసుకెళ్లాలని తనకు తెలిసిన ఆటో డ్రైవర్ రవిని..రమణమ్మ ఇంటికి రమ్మంది. అతను ఇంటికి వచ్చేలోగా భర్త చనిపోయాడు. దీంతో అదే ఆటోలో భర్త మృతదేహాన్ని స్వగ్రామం సింగనొడ్డుపల్లెకు తీసుకెళ్లింది. అంతలో తల, మెడపై గాయాలు ఉండటాన్ని గమనించి, రమణమ్మను ప్రశ్నించారు. తనదైన శైలిలో భర్త అన్న వెంకటరమణ ఆమెను నిలదీయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుటుంబీకు లు కలకడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మదనపల్లె పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ మహబూబ్ బాషా..సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుని అన్న వెంకట రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశా రు. ఈక్రమంలో నిందితులు రమణమ్మ, ఆమె ప్రియుడు గగన ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మదనపల్లె, అక్టోబరు 30: మదనపల్లెకు చెందిన కె.కేశప్పనాయు డు(22)అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం మేరకు..సత్యసాయి జిల్లా కదిరి మండలం దిన్నెమీదపల్లెకు చెందిన బి.రమణప్ప, రాజమ్మ కుటుంబం ఏడాది క్రితం ఉపాధి నిమిత్తం మదన పల్లెకు వచ్చింది. ఈ క్రమంలో స్థానిక చౌడేశ్వరీనగర్‌లో నివాస ముంటూ కుమారుడు కె.కేశప్పనాయుడుతో సహాస్థానిక టమోటా మార్కెట్‌లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగి స్తోంది. ఇంతలో ఏమైందో ఏమో..పనిమీద బయటకు వెళ్తున్నా నని చెప్పిన కుమారుడు కె.కేశప్పనాయుడు..మదనపల్లె మండ లం సీటీఎం రైల్వేస్టేషనకు సమీపంలో గుంతల్లు నుంచి తిరుప తికి వెళ్లే ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబీకులు, పోలీసుల కు సమాచారం అందించారు. ఈమేరకు కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీలేరు అంకాళమ్మ ఆలయంలో చోరీ
పీలేరు, అక్టోబరు 30: పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని రౌద్రాల అంకాళమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం ముందు భాగంలో ఉన్న హుండీని పగులగొట్టి అందు లోని నగదును ఎత్తుకెళ్లేందుకు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించారు. అయితే ఈ నెల 27వ తేదీన హుండీ లెక్కింపు జరిగి ఉండడంతో అందులో పెద్దగా నగదు లేకుండాపోయింది. దీంతో దుండగులు ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి ఉన్న మంగళసూత్రాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం సోమవారం ఉద యం గమనించిన పూజారులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసు లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వేలిముద్రల నిపుణులను రప్పించి ఆలయంలో క్షుణ్ణంగా వేలి ముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు ఎస్‌ఐ-2 రమణ తెలిపారు.
Updated Date - 2023-10-30T23:49:54+05:30 IST