ఎనర్జీ అసిస్టెంట్లను ఉద్యోగులుగా గుర్తించాలి
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:10 PM
ఎనర్జీ అసిస్టెంట్లను సచివాలయాల ఉద్యోగులు గా గుర్తించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసి యేషన సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
రాయచోటిటౌన, డిసెంబరు 26: ఎనర్జీ అసిస్టెంట్లను సచివాలయాల ఉద్యోగులు గా గుర్తించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసి యేషన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళ వారం విద్యుతశాఖ ఏడీఈ చానబాషా, ఏఈ నాగరాజుకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఎనర్జీ అసిస్టెంట్ల ప్రొబేషన డిక్లరేషన జీఎస్ డబ్ల్యూఎస్ ద్వారానే చేసి ఎస్‌ఆర్‌లు ఓపెన చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ జాబ్‌చార్ట్‌లను అనుసరించే విధంగా ఆదేశాలు ఇవ్వాల న్నారు. ఈహెచఎస్ కార్డులను మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే జీపీఎస్ అమలుచేయాలన్నారు. విద్యుత ప్రమాదంలో మరణించిన వారి కుటుంబా లకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత ఉద్యోగులుగా గుర్తించి పాత సర్వీస్ రూల్స్ అమలు చేయడంతోపాటు, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరారు.
Updated Date - Dec 26 , 2023 | 11:11 PM