అసైన్‌మెంట్ పట్టాల పేరుతో ఆక్రమణలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:09 PM
పలు గ్రామాల్లో వైసీపీ నేతలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, గుట్టలు ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టిం చుకోవడం లేదని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు
అడ్డుకున్న గ్రామస్తులు, రైతులు
రామాపురం, డిసెంబరు26: పలు గ్రామాల్లో వైసీపీ నేతలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, గుట్టలు ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టిం చుకోవడం లేదని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. గోపగుడిపల్లె పంచాయతీలో సర్వే నెంబర్ 997లో 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన (కుందేలగుట్ట) ఆయ కట్టు బంజరు కలదు. ఈ భూమిని ప్రజాప్రతినిధు లు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండ దండలతో కొందరు వైసీపీ నేతలు అసైన్‌మెంట్ పేర్లతో ఎక్స్‌కవేటర్లతో సోమవారం గుట్టను చదును చేస్తుండగా అందే గ్రామానికి చెందిన రైతులు, నేత లు అడ్డగించారు. ప్రభుత్వ భూమిని గుట్టను ఎం దుకు చదును చేస్తున్నారు,
గ్రామంలోని పశువులకు మేతలేక ఇబ్బంది పడుతుంటే ఎలాగని వారు ప్రశ్నించారు. తహసీల్దార్, సర్వేయర్, వీఆర్‌ఓ ను అడిగామని చదును చేసుకుంటే పట్టాలిస్తామని వారు చెప్పడంతో తాము గుట్టను చదును చేస్తు న్నామని రైతులకు సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో గుట్ట సగం వరకు చదును చేశారని, అధికారులు చూసీచూడనట్లు ఉండిపోతున్నారని, ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధుల అండతో నేత లు, కార్యకర్తలు ఈ అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రజలు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసు కుని భూఆక్రమణ కాకుండా చూడాలని కోరారు.
ఆక్రమితులపై కఠిన చర్యలు తీసుకుంటాం
మండలంలో వంకలు, వాగులు, చెరువులు, కుంట లు, ప్రభుత్వ భూము లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటా ము. గుట్టలు, వాగులు, వంకలు, చెరువులు పట్టా ఇచ్చేదానికి వీలుండదని రైతు తా ము సాగు చేసు కుంటూ ప్రభుత్వ భూ మిగా ఉంటే వాటిని పరిశీలించి రైతులకు అసైన్‌మెంట్ పట్టా ఇస్తాము.
అరవింద్‌కిశోర్, ఇన్‌చార్జి తహసీల్దారు.
Updated Date - Dec 26 , 2023 | 11:09 PM