ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

22 నుంచి మహావిష్ణు ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:07 PM

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వర కు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవస్థానంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ముక్కోటి బసిరెడ్డి తెలిపారు.

ప్రత్యేక అలంకరణలో శ్రీమహావిష్ణువు

రామాపురం, డిసెంబరు 17: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వర కు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవస్థానంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ముక్కోటి బసిరెడ్డి తెలిపారు. 22వ తేదీ ఉదయం గంగానయ నం, గోపూజ, యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపారాధన, ప్రధాన దేవతా కలశ స్థాపన, ఆరాధన, మూలమూర్తులకు అభిషేకాలు, అలంకరణ, మహామంగళ హారతి, తీర్థప్రసాదాల వితరణ ఉంటా యన్నారు. సాయంత్రం నుంచి ప్రదోష పూజలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, మహాసుదర్శన యాగం, నవగ్రహ హోమం, మంగళహారతి, తీర్థ ప్రసాదం అందిస్తామన్నారు. 23వ తేదీన వైకుంఠ ఏకాదశి సంద ర్భంగా తెల్లవారుజామున మూలమూర్తుల విగ్రహాలకు సుప్రభాత సేవ, అభి౉ షకం, ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు మహావిష్ణు దర్శనం కల్పిస్తామన్నారు. 24వ తేదీన శ్రీ దేవి, భూదేవి సమేత మహావిష్ణువు కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Dec 17 , 2023 | 11:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising