కాంట్రాక్టర్ల స్వలాభం..రైతులకు శాపం
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:41 PM
కాంట్రాక్టర్లు వారి స్వలాభం కోసం శీతివా రిపల్లె చెరువు నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలించడంతో కట్ట బలహీనపడి చెరువు తెగిపోయి రైతులను నిండా ముంచింది.
చెరువు నుంచి ఇష్టానుసారంగా మట్టి తరలింపు
తెగిన శీతివారిపల్లె చెరువు దెబ్బతిన్న పంటపొలాలు
భారీగా నష్టపోయిన రైతులు
కురబలకోట, డిసెంబరు 18: కాంట్రాక్టర్లు వారి స్వలాభం కోసం శీతివా రిపల్లె చెరువు నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలించడంతో కట్ట బలహీనపడి చెరువు తెగిపోయి రైతులను నిండా ముంచింది. ఎగువ ప్రాంతంలో ఉన్న హంద్రీ-నీవా కాలువ నుంచి లీకేజీ నీరు రావడంతో చెరువు పూర్తిగా నిండి చెరువు నీరంతా కిందకు వెళ్లడంతో పంటపొలా లు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలం లోని పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ శీతివారిపల్లె సమీపంలోని శీతివారి చెరువు నుంచి ముదివేడు రిజర్వాయర్ నిర్మాణ పనుల కోసం అవసర మైన మట్టిని యంత్రాల సాయంతో రాత్రింబవళ్ళు తరలించారు. గ్రామ సమీపంలోని జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మట్టిన ఈ చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా స్థానికులు అభ్యంతరం చేసి నా పట్టించుకోలేదు. దీంతో కట్ట సమీపంలో పెద్దపెద్ద గుంతలు పెట్టి భారీస్థాయిలో మట్టిని తరలించారు. అప్పట్లో వర్షాలు లేకపోవడం ఏమి నష్టం జరగలేదు. ఇటీవల కొద్దపాటిగా వర్షాలు కురవడంతో కొం డ ప్రాంత నుంచి నీరంతా అక్కడికి చేరడంతో కొంత వరకు నిండింది. అయితే ప్రభుత్వం హంద్రీ-నీవా కాలువలకు నీటిని విడుదల చేసింది. ఆ చెరువు పైగా భాగంలో హంద్రీ-నీవా కాలువ పోతుండటం దానికి లీకేజీ కావడంతో నీరంతా దిగువనున్న చెరువుకు చేరి బలహీనపడిన కట్ట నీటీ ఉధృతను తట్టుకోకపోవడంతో తెగిపోయింది. ఈ చెరువు కింద దాదాపుగా వంద 50 ఎకరాలకు పైగా వ్యవసాయం చేస్తున్నారు. దీని కింది రైతులు టమోటా, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర రకాల పంటలను సాగు చేశారు. కాగా చెరువు తెగడంతో నీరంతా పంటపొలాలపై వెళ్లడంతో చేతికి వచ్చిన పంటలు నీట మునిగి పూర్తి గా దెబ్బతిని రైతన్నలు లక్షలాది రూపాయలు నష్టపోయారు. ప్రభు త్వం పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తు న్నారు. అంతేకాకుండా రెండు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కాగా సోమవారం రెవెన్యూ, ఇరిగేషన అధికారులు అక్కడ వెళ్లి పరిశీలించి చెరువు మరమ్మతు నిర్మాణ పనులను చేపట్టారు. చెరు వు తెగిపోవడంతో నష్టపోయిన రైతుల వివరాల నివేదికను జిల్లాస్థాయి అధికారులకు అందజేసి ఆదుకుంటామని అధికారులు తెలిపారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కురబలకోట మండలంలోని పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ శీతివారిప ల్లె సమీపంలోని చెరువు తెగడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ కిసాన మోర్చా అధికార ప్రతినిధి చల్లప ల్లె నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చెరువు తెగిన ప్రాంతంను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. చెరువ తెగడంతో నీరంతా పంటపొలాలపై వెళ్ళడంతో చేతికి వచ్చిన పంటలు నీట మునిగి రైతులు భారీస్థాయిలో నష్టపోయారన్నారు. అనంతరం ఆర్డీవోతో మాట్లాడి మరమ్మతులు, చెరువు కట్ట పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బావాజాన, దివాకర్ రెడ్డి, చిన,్నప్ప, ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:41 PM