జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:14 AM
అన్నమయ్య జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానా లకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు షేక్ అల్లాబకస్ వెల్లడించారు.
పెద్దమండ్యం, డిసెంబరు 13: అన్నమయ్య జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానా లకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు షేక్ అల్లాబకస్ వెల్లడించారు. పెద్దమండ్యం మండలం కలిచె ర్లలో బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక ర్తలు, నాయకుల సమావేశంలో తంబళ్లపల్లి ని యోజక వర్గంలో కొత్తగా ఎంపికైన మండల పార్టీ అధ్యక్షులకు ఎంపిక పత్రాలను అంద జేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రం విభజన పాపం పారీపై మోపి నాయకులంతా పార్టీ విడిపోయి కాంగ్రెస్‌ను కష్టకాలంలోకి నెట్టివేశారని తెలిపారు. మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నా రు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, తంబళ్లపల్లి సీనియర్ నాయకులు ఎంఎస్ చంద్రశేఖరరెడ్డి, రామకృష్ణరెడ్డి, చిన్నికృష్ణ, శ్రీవర్ధన, మంజునాధ తదితరులు పాల్గొన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరే: పెద్దమండ్యం మండల అధ్యక్షుడిగా మోహారాజ్‌వ లీ, కురబలకోటకు వాసు, తంబళ్లపలికి గోపాల్, పీటీఎంకు బావాజాన, ములకలచెరువు కు శ్రీనివాసులు, బి. కొత్తకోట మండలానికి వివేక్‌లను నియమించినట్లు తెలిపారు.
సుస్థిర పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం
రామసముద్రం, డిసెంబరు 13: దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సుస్థిర పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డిసాహెడ్ అన్నారు. రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ గంపనపల్లెలో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం గ్రామానికి చెందిన బి.బాబు, పి.మర్రినంజే గౌడు, బి.రామాంజులు, పి.మంజు నాథ, బి.వెంకటరమణ, బి.వెంకటరెడ్డి, కర్ణ, రవి, విజయ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేశారు.
Updated Date - Dec 14 , 2023 | 12:14 AM