ముగిసిన జిల్లా రచయితల సంఘం మహాసభలు
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:03 PM
జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కడప నగర జిల్లా పరిషత్ సభాభవనంలో రెండు రోజులుగా నిర్వహించి మహాసభలు కవి సమ్మేళనాలతో ఆదివారం ముగిశాయి.
కడప (కల్చరల్), డిసెంబరు 24 : జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కడప నగర జిల్లా పరిషత్ సభాభవనంలో రెండు రోజులుగా నిర్వహించి మహాసభలు కవి సమ్మేళనాలతో ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ, కథా రచయిత బొమ్మిశెట్టి మోహన్ అధ్యక్షత వహించగా, ప్రముఖ కథా రచయిత దాదాహయత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆధునిక పద్య కవిత్వం పై డాక్టర్ నరాల రామారెడ్డి, జిల్లా అవధానులు అంశంపై ఆముదాల మురళి, జిల్లా పత్రికారంగం అంశంపై తుమ్మలూరు సురే్‌ష్ బాబు, జిల్లా సాహిత్య విమర్శపై ఎం.విజయభాస్కర్ పత్ర సమర్పణ చేశారు. జిల్లా జానపద సాహిత్యంపై ఆచార్య సిగిచర్ల కృష్ణారెడ్డి, జిల్లా నాటకసాహిత్యం అంశంపై కొప్పోలు రెడ్డిశేఖర్‌రెడ్డి, జిల్లా ముస్లిం వాద సాహిత్యం అనే అంశంపై తవ్వా వెంకటయ్య, జిల్లా సాహిత్య దళిత సాహిత్యం అనే అంశంపై కోడూరు స్వతంత్రబాబు పత్ర సమర్పణ చేశారు. అనంతరం డాక్టర్ సీవీ సుబ్బన్న సభావేదికపై అవధానుల స్వీయానుభవాలు అనే సదస్సుకు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు గానుగపెంట హనుమంతరావు అధ్యక్షత వహించగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చదువుల బాబు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. డాక్టర్ నరాల రామారెడ్డి, మేడసాని మోహన్ , ఆముదాల మురళి, లోకా జగన్నాఽథశాస్త్రి తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి .జింకా సుబ్రమణ్యం, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప, అన్నమయ్య అధ్యక్షుడు పోతుల వెంకట్రామిరెడ్డి, జిల్లా నలుమూలల నుంచి పలువురు కవులు హాజరయ్యారు. జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు షేక్ హుసేన్ సత్యాగ్నితో పాటు ప్రముఖ ఆడిటర్ లయన్ పి.ఖాసింఖాన్‌లు పాల్గొన్నారు. చివరగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూలమల్లికార్జునరెడ్డి సమాపన ప్రసంగంచేశారు.
Updated Date - Dec 24 , 2023 | 11:04 PM