ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బలవంతంగా తెరుచుకున్న అంగన్వాడీ కేంద్రాలు

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:29 PM

ఒక వైపున అంగన్వాడీ కార్యకర్త లు సమ్మె చేస్తున్నా అధికారులు బలవంతంగా అంగన్వా డీ కేంద్రాలను తెరిపించారు.

కొండపేటలో తాళాన్ని పగలగొడుతున్న మహిళ

చెన్నూరు, డిసెంబరు 14: ఒక వైపున అంగన్వాడీ కార్యకర్త లు సమ్మె చేస్తున్నా అధికారులు బలవంతంగా అంగన్వా డీ కేంద్రాలను తెరిపించారు. తాళాలు పగలకొట్టి మరీ గదులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఆయాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీడీపీ నేతలు, ఎస్టీయూ ఉపాధ్యాయ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సంఘీభావం ప్రకటించారు.

రెండురోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెతో మండల వ్యాప్తంగా 55 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డా యి. దీంతో గర్భిణులు, బాలింతలు చిన్నారులకు పౌష్టికా హారం అందించాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో అంగ న్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలు పంచాయతీ కార్యదర్శు లు వీఆర్వోల సహకారంతో ఆయా ప్రాంతాల్లోని వారిచే కేంద్రాలకు వేసిన తాళాలను పగలగొట్టి తలుపులు తీశారు. ఆ కేంద్రాల్లో ఏఏ పౌష్టికాహారం ఉంది, ఎంతెంత ఉంది, ఏ మేరకు ఉంది, ఇంత వరకు జరిగిన పంపిణీ, ప్రస్తుతం ఎంత మందికి పంపిణీ చేయాలని, అంతా సకర్మంగా ఉం దా లేదా, ఎంపీడీఓ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యద ర్శుల సమక్షంలో వీఆర్వోలు పంచనామా చేసి నమోదు చేసుకున్నారు. చాలా ఏళ్లగా తమకు ప్రభుత్వం ఏమీ చేయలేదని కంటి తుడుపు చర్యగా చిన్న మొత్తాన్ని పెంచి ఆపై పట్టించుకోకుండా అన్ని బాధ్యతలు తమకే అప్పగి స్తూ పనులు చేయించుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వ సమయం ముగిసిపోతున్న సమయంలో అయినా తమ డిమాండ్లు తీర్చాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగారు.

చింతకొమ్మదిన్నె మండలంలో....

సికెదిన్నె, డిసెంబరు 14: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో తాళాలు తెరిపించారు. తాళాలు ఇవ్వక పోవడంతో సచివాలయ సిబ్బంది తాళాలు పగులకొట్టి అంగన్వాడీ సెంటర్లను తెరచి స్టాక్‌ వివరాలు పరిశీలించారు. కొన్ని చోట్ల అంగన్వాడీ టీచర్లను బెదిరించినట్లు తెలుస్తోంది. వీఆర్వోలు, మహిళా పోలీసులు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగులకొట్టి తెరిచారన్నారు.

సమ్మెకు టీడీపీ, ఎస్టీయూ నేతల మద్దతు

వేంపల్లె, డిసెంబరు 14: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే వర్కర్లు, ఆయాల న్యాయమైన సమస్యలు వెంటనే పరి ష్కరించాలని టీడీపీ నేతలు, ఎస్టీయూ ఉపాధ్యాయ నేత లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఎస్టీయూ ఉపాధ్యాయ నేతలు నరసింహారెడ్డి, సంగమేశ్వరరెడ్డి, రాజశేఖర్‌, శివారెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ రామముని రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ డైరెక్టర్‌ దర్బార్‌ టీడీపీ నేతలు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising