ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధికారంలోకి రాగానే భూ హక్కు చట్టం రద్దు

ABN, Publish Date - Dec 29 , 2023 | 11:33 PM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ పార్టీ నేత సుగవాసి బాల సుబ్ర మణ్యం, రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటిం చారు.

ర్యాలీలో అఖిల పక్షం నేతలు, న్యాయవాదులు

రాయచోటిటౌన, డిసెంబరు 29: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ పార్టీ నేత సుగవాసి బాల సుబ్ర మణ్యం, రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటిం చారు. భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా భా రత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్‌) ఉమ్మడి కడప జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీ. ఈశ్వర్‌ అధ్యక్షతన శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్‌ ఫ్లెక్సీ వద్ద అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, కాంగ్రె స్‌, జనసేన, సీపీఐ, రైతు సంఘం, సీపీఐ (ఎం ఎల్‌) న్యూడెమోక్రసీ, భారతీయ అంబేద్కర్‌సేన తో పాటు న్యాయవాదులు, కక్షిదారులు ప్రసం గించారు. భూ హక్కుల చట్టం రద్దు కోసం భవి ష్యత్తులో జరగబోయే ఏ పోరాటానికైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం రాయచోటి తహసీల్దార్‌ కార్యాలయం నుంచి నేతాజీ క్లబ్‌ వరకు ప్లకార్డు లు ధరించి ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఖాదర్‌వలి, కాంగ్రెస్‌ నేతలు అల్లాబకష్‌, సీపీఐ శ్రీనివాసులు, విశ్వనాఽథనాయక్‌, రైతు సం ఘం రంగారెడ్డి, రజక సంఘం శ్రీనివాసులు, రమేశబాబు, ప్రజా సంఘాల కార్యదర్శి రామాం జనేయులు, జనసేన నేతలు, పెమ్మాడపల్లి సర్పంచ పల్లపు వాసు, బీసీ సంఘం న్యాయ వాది నాగముని, విద్యావంతుల వేధిక నాయ కులు జయరాం, మారుతీశంకర్‌, బాస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతయ్య, వీరబల్లి మండల టీడీపీ భానుగోపాల్‌రాజు, సీపీఐ (ఎంఎల్‌) నాయకు డు విశ్వనాఽథ్‌, న్యాయవాదులు , ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 11:33 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising