ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కనుల పండువగా వైకుంఠ ద్వార దర్శనం

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:06 PM

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండలం లోని కంభారాయునిగుట్టపైన వెలసిన శ్రీమహావిష్ణు దేవాలయంలో శనివారం ఉదయం నుంచి అభిషేకాలు, పూజలు, హోమాలు, సత్య నారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు.

ప్రత్యేక అలంకారంలో వేంకటేశ్వర స్వామి

రామాపురం, డిసెంబరు 23: ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండలం లోని కంభారాయునిగుట్టపైన వెలసిన శ్రీమహావిష్ణు దేవాలయంలో శనివారం ఉదయం నుంచి అభిషేకాలు, పూజలు, హోమాలు, సత్య నారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. . ఎస్‌ఐ కొండారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన ముక్కోటి బసిరెడ్డి, ఆ గ్రామ సర్పంచ భారతి, ముక్కోటి ఆంజనేయులరెడ్డి, బసమ్మ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. అభయహస్త ఆంజనేయస్వామి ఆలయంలో ఇండియన గ్యాస్‌ ఏజెన్సీ సీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పూజలు అన్నదానం చేశారు.

గాలివీడు: మండల కేంద్రంలోని వేంకటేశ్వరాలయంతో పాటు చీమల చెరు వు పల్లి, రెడ్డివారిపల్లె ల్లోని వైష్ణవాలయాల కు ప్రజలు పోటె త్తారు. ధర్మకర్తలు, పూజారులు తీర్థప్రసాదాలను అంద జేశారు.

రైల్వేకోడూరు: పట్టణంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆల యంలో బండాత్మకూరు మణి కంఠశర్మ ఆధ్వర్యంలో అభిషేకా లు, తోమాల సేవ, పూజలు నిర్వ హించారు. అయ్యప్పస్వామి, భుజం గేశ్వర, కోదండ రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కె. బుడుగుంటపల్లెలోని ఆలయంలో అన్నదానం చేశారు.

సుండుపల్లె: ముడుంపాడు గ్రామ పంచాయతీ ఆరోగ్యపురం, మాచిరెడ్డిగారి పల్లెలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పట్టువస్త్రాలను సమర్పించి పూజ లు చేశారు. టీడీపీ ఎస్టీ సెల్‌ నాయకుడు ఆనంద నాయక్‌, పార్లమెంట్‌ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి దామోదర్‌ నాయుడు పూజలు చేశారు.

చిట్వేలి: కేవీఎస్‌ అగ్రహారంలో వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. సింగనమల వీధి రామాలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మూలరోడ్డు ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు.

వీరబలి: మండలంలోని హరిహరాదుల ఆల యం, పుత్తావాండ్లపల్లె పాలకొండ వెంకటేశ్వర ఆలయంలో ఉత్తరద్వార దర్శ నం కల్పించారు. హరిహరా దుల ఆలయంలో లక్ష్మినారాయ ణులను పూజారి లావణ్య రామశర్మ దూదితో ప్రత్యేకంగా అలంకరించారు.పాలకొండ వెంక టేశ్వరాలయంలో శనివారం సాయం త్రం పద్మావతీ వెంకటేశ్వర కల్యాణం జరిపించారు.

Updated Date - Dec 23 , 2023 | 11:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising