ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:25 PM

విద్యార్థులు శాస్ర్తీయ దృక్ఫధాన్ని అలవర్చుకోవాలని, వారిలో దాగిఉన్న సృజనాత్మక త వెలుగులోకి తీసుకురావచ్చని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్‌ పురుషోత్తం అన్నారు.

సభలో మాట్లాడుతున్న డీఈఓ శ్రీరామ్‌ పురుషోత్తం

రాయచోటి టౌన్‌, డిసెంబరు 23: విద్యార్థులు శాస్ర్తీయ దృక్ఫధాన్ని అలవర్చుకోవాలని, వారిలో దాగిఉన్న సృజనాత్మక త వెలుగులోకి తీసుకురావచ్చని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్‌ పురుషోత్తం అన్నారు. ఎగువ అబ్బవరం వద్ద గల అర్చన విద్యాసంస్థలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ చిన్ననాటి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. వినూత్న ఆలోచనలతో సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్‌తోనే సాధ్యమవుతుందన్నారు. అర్చన విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడు తూ విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు.

విద్య అంటే కేవలం మార్కుల సాధనే కాదని జ్ఞానం, నూతన పరిశోధనల పట్ల జిజ్ఞాస పెంచుకోవడమన్నారు. ఏపీజే అబ్దుల్‌కలాం, సర్‌సీవీ రామన్‌, కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌ తదితర మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నా రు. జిల్లా సైన్స్‌ అధికారి మార్ల ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్‌ ప్రాజెక్టులను డీఈఓ సహా ఇతర విద్యాశాఖాధికారులు పరిశీలించారు. స్కౌట్స్‌ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, డీసీఈబీ సెక్రటరీ నాగమునిరెడ్డి, యూటీఎఫ్‌, పీఎస్టీయూ, జేవీవీ నేతలు రాజారమేశ్‌, జక్రియాబాషా, ప్రకాశ్‌రెడ్డి, జిల్లా అసోసియేట్‌ సైన్స్‌ ఆఫీసర్‌ రామచంద్ర, కలాం విజన్‌ డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌, అర్చన విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ మౌలాలి పాల్గొన్నారు.

విజేతలు వీరే...

జిల్లాలోని 30 మండలాల నుంచి 90 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు ఉంచగా వ్యక్తిగత విభాగం నుంచి 3 ప్రాజెక్టులు, గ్రూపు విభాగం నుంచి 3 ప్రాజెక్టులు, ఉపాధ్యాయ విభాగం నుంచి 3 ప్రాజెక్టులు మొ త్తం 9 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. వీరు 28, 29వ తేదీల్లో కడపలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో తమ ప్రాజెక్టులను ప్రదర్శించాల్సి ఉందన్నా రు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలిలా న్నాయి.

బి. కొత్తకోట మండలం ఏపీఎ్‌సడబ్ల్యుఆర్‌ఎస్‌ పాఠశాల విద్యార్థి ఎస్‌. రోహిత్‌, కలకడ మండలం ఏపీఆర్‌ఎస్‌ గర్ల్స్‌ పాఠశాల విద్యార్థి లిఖిత, పీలేరు మండలం, ఎంజేపీఏపీబీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థి అక్షయ ఉన్నారు.

గ్రూపు విభాగంలో...

తంబళ్లపల్లె మండలం ఎంజేపీ ఏపీబీసీ వెల్ఫేర్‌ పాఠశాల విద్యార్థులు యశ్వంత్‌, శివమణి, రాయచోటి మండలం మోడ ల్‌ స్కూల్‌ విద్యార్థులు కేఎండీ అనస్‌, రిహాన్‌, కురబలకోట మండలం అంగళ్లు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థి తన్వీర్‌ అలీఖాన్‌, ఉదయ్‌లు ఉన్నారన్నారు.

ఉపాధ్యాయ విభాగంలో....

బి. కొత్తకోట మండలం బడికాయలపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయులు చంద్రశేఖర్‌, ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు శివప్రసాద్‌, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయనీ విజయకుమారి ఉన్నారన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising