ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నియోజకవర్గంలో 20వేల ఓట్లు తొలగించారు..!

ABN, First Publish Date - 2023-10-30T23:44:04+05:30

మదన పల్లె నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల దాకా ఓట్లు తొలగించినట్లు తమకు సమాచారం వచ్చిందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేశ పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ

ముసాయిదా జాబితా పరిశీలించండి

క్లస్టర్‌ ఇనచార్జిలకు దొమ్మలపాటి సూచనలు

మదనపల్లె టౌన, అక్టోబరు 30: మదన పల్లె నియోజకవర్గంలో 10 నుంచి 20 వేల దాకా ఓట్లు తొలగించినట్లు తమకు సమాచారం వచ్చిందని మదనపల్లె టీడీపీ ఇనచార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేశ పేర్కొన్నారు. దీనిపై టీడీపీ క్లస్టర్‌, బూత ఇనచార్జిలు కలసి అధికా రులు విడుదల చేసిన ముసాయిదా ఓట రు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు. సోమవారం స్థానిక అన్నమయ్యసర్కిల్‌లోని టీడీపీ కార్యాలయం లో నియోజవకర్గంలోని టీడీపీ క్లస్టర్‌ ఇనచార్జిల సమావేశంలో దొమ్మలపాటి మాట్లా డుతూ తొలగించిన ఓట్లను తిరిగి పొందేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కుటుంబ సాధి కారసారథులు 100 కుటుంబాలకు ఒక చైతన్య భేరి పెట్టి, లాగిన కావాలన్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాలను ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేయాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి వైసీపీ నాయకులు టీడీపీ వారిని భయపెట్టాలని చేస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలన, వైసీపీ నాయకుల దోపిడి గురించి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో నియోజక వర్గ టీడీపీ పరిశీలకుడు చలపతినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, తాజ్‌బాషా, నిస్సార్‌అహ్మద్‌, విజయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T23:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising