వర్మ వ్యాఖ్యలపై జనసేన నిరసన
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:05 AM
వ్యూహం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై వీర మహిళలు నిరసన తెలిపారు.
ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన వీర మహిళలు
సిరిపురం (విశాఖపట్నం), డిసెంబరు 25: ‘వ్యూహం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ, మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబులు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలపై వీర మహిళలు నిరసన తెలిపారు. సోమవారం నగరంలోని గాంధీ విగ్రహం వద్ద రామ్‌గోపాల్‌వర్మ, రోజా, అంబటి చిత్రాలతో రూపొందించిన బ్యానర్‌పై చెప్పులతో కొట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలను, పార్టీని చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ తాకట్టుపెట్టారని మంత్రులు వ్యాఖ్యానించడం తగదన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 03:05 AM