ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan's banner : జగన్‌ బ్యానర్‌ చింపేసిన మంత్రి గుమ్మనూరు అనుచరులు

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:24 AM

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపోయారు. ఈసారి గుమ్మనూరుకు ఆలూరు టికెట్‌ కష్టమేనన్న వార్తల నేపథ్యంలో ఆయన

ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

దెబ్బలతో వినికిడి సమస్య, మెడపై గాయాలు.. వైద్యుల నివేదిక

కర్నూలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు రెచ్చిపోయారు. ఈసారి గుమ్మనూరుకు ఆలూరు టికెట్‌ కష్టమేనన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఆస్పరి అంబేడ్కర్‌ కూడలిలో మంత్రి జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌, తమ్ముళ్లు నారాయణ, శ్రీనివాసులు సహా చిప్పగిరి నుంచి అనుచరులు సీఎం జగన్‌ జన్మదినం సంబరాలు జరుపుకుని కేక్‌ కట్‌ చేశారు. అదే సర్కిల్‌లో చిప్పగిరి వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షి జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లుగా మంత్రి జయరాం, విరుపాక్షిల మధ్య వర్గ విభేదాలు తారస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలో విరుపాక్షి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంత్రి అనుచరులు చింపుతూ రెచ్చిపోయారు. ఆ దృశ్యాలను పాత్రికేయులతోపాటు ఆంధ్రజ్యోతి రిపోర్టరు శివకేశవ్‌ కూడా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తుండగా గమనించిన జయరాం అనుచరులు రెచ్చిపోయారు. ఈశ్వర్‌, తమ్ముళ్లు సమక్షంలోనే అనుచరులు శివకేశవ్‌పై మూకుమ్మడిగా దాడిచేశారు. కాళ్లలో విచ్చలవిడిగా తంతూ.. చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శివకేశవ్‌ సెల్‌ఫోన్‌తో పాటు ఆయన జేబులో ఉన్న యాడ్‌ అమౌంట్‌ రూ.12 వేలకుపైగా నగదు తీసుకెళ్లారు. శివకేశవ్‌ను వైద్యం కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బయటకు కనిపించని గాయాలయ్యాయి. ఎడమ చెవిపై బలంగా కొట్టడంతో బలమైన దెబ్బ తగలడం వల్ల వినికిడి సమస్య తలెత్తిందని, మెడపై గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘనటపై స్థానిక ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మురళి ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలసి ఎస్‌ఐ వరప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై దాడి దారుణం

కర్నూలు జిల్లా ఆస్పరి ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి శివకేశవ్‌పై దాడి దారుణం అని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ కర్నూలు కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఏఎస్పీ సర్కార్‌ను కలసి కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఎస్పీ కృష్ణకాంత్‌ను ఫోన్‌లో సంప్రదించగా దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

10 రోజుల్లో నరకడం గ్యారెంటీ

ఓ సర్పంచ్‌కు మంత్రి గుమ్మనూరు సోదరుల బెదిరింపు

కర్నూలు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘నమ్మినదానికి ఇలా చేస్తారా...! నరుకుతాలే... గ్యారెంటీ పది రోజుల్లో...’ అంటూ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు, అనుచరులు ఓ సర్పంచును బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. జగన్‌ జన్మదిన వేడుకలను చిప్పగిరి వైసీపీ జడ్పీటీసీ విరుపాక్షి ఆధ్వర్యంలో జరుపుకోవడానికి ఆస్పరి మండలం బినిగేరి సర్పంచ్‌ వెంకటేశ్‌ కేకు తీసుకుని బయలుదేరారు. చిప్పగిరి మండలం నేమకల్లు సమీపంలో వెంకటేశ్‌ కారును మంత్రి సోదరులు, అనుచరులు అడ్డగించి కేకును నేలపై విసిరికొట్టారు. ‘నా కొడకా నరుకుతాలే.. గ్యారెంటీగా పది రోజుల్లో...’ అంటూ భయపెట్టారని బాధితుడు తెలిపారు.

Updated Date - Dec 22 , 2023 | 03:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising