Jagan Mama : జగన్ మామా..
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:28 AM
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆదివారం లబ్ధిదారులు సైతం నిరసన తెలిపారు. ‘జగన్ మామా..
టీచర్, ఆయాల జీతాలు పెంచు
ప్లకార్డులు ప్రదర్శించిన చిన్నారులు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన అంగన్వాడీల నిరసన
జగన్ మామా.. మా టీచర్, ఆయాల
జీతాలు పెంచు!
ప్లకార్డులు ప్రదర్శించిన చిన్నారులు.. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన నిరసన
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆదివారం లబ్ధిదారులు సైతం నిరసన తెలిపారు. ‘జగన్ మామా.. మా(అంగన్‌వాడీ) టీచర్, ఆయాకు జీతాలు పెంచు’ అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం ముద్దపుకుంట గ్రామ అంగన్‌వాడీ కేంద్రం వద్ద లబ్ధిదారులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులు నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు ఉంటేనే తాము కేంద్రానికి వస్తామనీ, సచివాలయ సిబ్బంది నిర్వహిస్తే వచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఏలూరు జిల్లాలో అంగన్‌వాడీలు ఆరో రోజు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని పేర్కొన్నారు. కైకలూరులో అంగన్‌వాడీలో చిన్నారుల తల్లులు నిరసనకు మద్దతు తెలిపారు. బాపట్ల జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులైన గర్భిణులు సమ్మెకు మద్దతు తెలిపారు. చీరాలలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో సహా వచ్చిన పిల్లలు ‘‘జగన్ మామా..
ఆయాలకు న్యాయం చేయాలి’’ అని నినదించారు. సంతమాగులూరులో పలకలపై నినాదాలు రాసి సమ్మెకు బాసటగా నిలిచారు. ఇక అద్దంకి, బాపట్లలో ఆకులు నములుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు తమ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనకు మద్దతుగా పలువురు చిన్నారులు, వారి తల్లులు పాల్గొన్నారు. ‘జగన్ మామయ్య మా ఆయమ్మకు జీతాలు పెంచండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మాకు మంచి పాలు ఇప్పించండి... మా టీచర్లకు జీతాలు పెంచండి’ అంటూ మైకులు పట్టుకుని అంగన్వాడీలతో కలిసి చిన్నారులు నినాదాలు చేశారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా అంగన్వాడీలు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎన్.బాబూరావు, ఎం.వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలి చెంప ఛెళ్లుమనిపించిన ఏఎస్‌ఐ
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఓ వృద్ధురాలిపై ఏఎ్‌సఐ తన ప్రతాపం చూపించారు. అంగన్‌వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టవద్దన్న విన్నపాన్ని నేరంగా భావించి.. గ్రామానికి చెందిన వృద్ధురాలి చెంపను ఛెళ్లుమనిపించారు. అంగన్‌వాడీల నిరసనలో భాగంగా ఆయా కేంద్రాలకు సిబ్బంది తాళాలు వేశారు. అయితే, వాటి తాళాలు పగలగొట్టేందుకు పంచాయతీ, సచివాలయాల అధికారులు కొలకలూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు, టీడీపీ, జనసేన పార్టీల నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఇంతలో ఓ వృద్ధురాలు ‘అయ్యా అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టవద్దు. ప్రభుత్వం న్యాయం చేసేలా చూడండి’’ అని విన్నవించారు. ఈ విన్నపానికి ఆగ్రహోదగ్రుడైన ఏఎ్‌సఐ వెంకటరమణ వృద్ధురాలని కూడా చూడకుండా చెంపపై చాచి కొట్టారు.
Updated Date - Dec 18 , 2023 | 02:29 AM