ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vangalapudi Anitha: అది జగన్‌ ఫేక్‌ బ్యాచ్‌ పనే: అనిత

ABN, First Publish Date - 2023-03-09T19:53:08+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫేక్‌ బ్యాచ్‌ తనపై తప్పుడు కథనంతో ట్రోలింగ్‌కు పాల్పడిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫేక్‌ బ్యాచ్‌ తనపై తప్పుడు కథనంతో ట్రోలింగ్‌కు పాల్పడిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆరోపించారు. తిరుపతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటల వీడియోను జగన్మోహన్‌రెడ్డికి చెందిన ఫేక్‌ బ్యాచ్‌... ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియా (Social Media)లో వైరల్‌ చేయడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దింపి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను ముఖ్యమంత్రిని చేసేంత వరకు మహిళలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ తాను మాట్లాడితే...జగన్‌ సీఎం అయ్యేందుకు మహిళలు పనిచేయాలని అన్నట్టుగా వీడియోను ఎడిట్‌ చేసి, ట్రోల్‌ చేశారని మండిపడ్డారు. లండన్‌లో ఉంటున్న ఒక వ్యక్తి ప్రదీప్‌ పేరుతో ఫేక్‌ ఐడీతో ఈ వీడియోను ఎడిట్‌ చేశారని తెలిసిందన్నారు. తనపై తప్పుడు ట్రోల్స్‌ చేసిన వ్యక్తులు తిరిగి ఫోన్‌ చేసి బెదిరింపులు పాల్పడుతున్నారని అనిత తెలిపారు.

Updated Date - 2023-03-09T19:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising