ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గిరి బాటలో పల్లెకు పయనమైన ఐపీఎస్‌

ABN, First Publish Date - 2023-11-10T04:22:34+05:30

కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా గిరి బాట పట్టారు ఓ ఐపీఎస్‌ అధికారి. లోతట్టు అటవీ ప్రాంతంలో 7కి.మీ. నడిచి మారుమూల గిరిజన గ్రామానికి చేరుకున్నారు. రాజవొమ్మంగి

రాజవొమ్మంగి, నవంబరు 9: కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా గిరి బాట పట్టారు ఓ ఐపీఎస్‌ అధికారి. లోతట్టు అటవీ ప్రాంతంలో 7కి.మీ. నడిచి మారుమూల గిరిజన గ్రామానికి చేరుకున్నారు. రాజవొమ్మంగి మండలం, లోదొడ్డి పంచాయతీ, కిండంగి గ్రామం... చాలామంది అధికారులకు ఈ గ్రామం ఉందనే విషయమే తెలియదు. రోగమొచ్చినా, రొప్పొచ్చినా డోలీలే గతి. జడ్డంగి ఎస్‌ఐ రఘునాథరావు స్థానిక పరిస్థితులను ఉన్నాతాధికారులకు నివేదించారు. దీంతో గురువారం ఆ గ్రామంలో సీఐ బాజీలాల్‌ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రంపచోడవరం ఏఎస్పీ జగదీశ్‌ ఆడహళ్లి వచ్చారు. నడకమార్గం తప్ప మరో దారిలేని కిండంగి బాట పట్టిన జగదీశ్‌ 7కి.మీ. నడిచారు. అతికష్టంమీద ఇతర పోలీస్‌ అధికారులతో కలసి గ్రామానికి చేరుకున్నారు. గిరిజనుల సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Updated Date - 2023-11-10T04:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising