ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గత ఎన్నికల హామీ... ఈ ఎన్నికల ముందు అమల్లోకి!

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:30 AM

జగన్‌ గత ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్‌ పెంపు హామీ ఎట్టకేలకు ఎన్నికల ముందు అమల్లోకి రానుంది. వచ్చే జనవరి నుంచి పెన్షన్‌ మొత్తం రూ.3

పెన్షన్‌ మొత్తాన్ని 3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు

అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జగన్‌ గత ఎన్నికల ముందు ఇచ్చిన పెన్షన్‌ పెంపు హామీ ఎట్టకేలకు ఎన్నికల ముందు అమల్లోకి రానుంది. వచ్చే జనవరి నుంచి పెన్షన్‌ మొత్తం రూ.3 వేలు అందించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతామని జగన్‌ హామీ ఇచ్చినా... అది నాలుగున్నరేళ్ల తర్వాత నెరవేరింది. మరో ఆర్నెల్లలో ఎన్నికలు ఉన్నాయనగా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఒక్కో అవ్వ, తాత మరో రూ.13,500 పెన్షన్‌ అదనంగా పొందేవారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు రూ.8,500 కోట్లు నష్టపోయారు. 60 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ఆలస్యంగా అమలు చేశారు. ప్రతి నెలా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న హామీని తుంగలో తొక్కారు. వయోపరిమితి తగ్గించినా పెన్షన్ల సంఖ్య మాత్రం పెంచకుండా పలు నిబంధనలతో కోత కోశారు. అందుకే చంద్రబాబు హయాంలో 19 లక్షల పెన్షన్లు ఇస్తే, జగన్‌ సర్కార్‌ వయో పరిమితి తగ్గించినా... ఇచ్చిన పెన్షన్లు 12 లక్షలకు మించలేదు. పాత పెన్షన్లు తొలగిస్తేనే కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది.

Updated Date - Dec 22 , 2023 | 03:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising