ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేపల్లె వైసీపీలో.. ఆరని మంటలు!

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:06 AM

రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ తొలగింపు వైసీపీలో చిచ్చురేపింది. ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వాల్సిందేనని మత్స్యకారులు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

మోపిదేవికి టికెట్‌ ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని హెచ్చరికలు

తాడేపల్లిలో మత్స్యకార సంఘాల నేతల భేటీ

రెండుగా చీలిన రేపల్లె వైసీపీ శ్రేణులు

బాపట్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ తొలగింపు వైసీపీలో చిచ్చురేపింది. ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వాల్సిందేనని మత్స్యకారులు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి మత్స్యకార సంఘాల నేతలు సోమవారం తాడేపల్లిలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. మోపిదేవికి అన్యాయం చేస్తే వైసీపీని ఓడిస్తామని హెచ్చరించారు. తీరప్రాంతంలో గెలిచే అవకాశాలున్న సీట్లను తమకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మోపిదేవి స్థానంలో ఈవూరు గణేశ్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఈ నెల 11న వైసీపీ అధిష్ఠానంప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 12న మత్స్యకార సంక్షేమ సంఘాలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మోపిదేవినే కొనసాగించాలని కోరారు. స్పందన కొరవడడంతో మత్స్యకార కులాల రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు కీలక సమావేశం నిర్వహించారు. సంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉపకులాల నేతలు హాజరయ్యారు. మోపిదేవికి రేపల్లె టికెట్‌ కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో పార్టీకి నష్టం వాటిల్లుతుందో వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 40-50 లక్షల మత్స్యకార కులాల వారు ఉన్నారని.. 40, 50 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నారని తెలిపారు. అలాంటి తమ వర్గానికి జగన్‌ అరకొర టికెట్లు ఇస్తూ అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కనీసం 20 సీట్లు కేటాయించాలన్నారు. ఎమె ్మల్యే, ఎంపీ ఇచ్చామంటూ చెప్పడం కాదని, మేము మిమ్మల్ని సీఎం చేశామని అందుకు ప్రతిఫలంగా మాకు టికెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు తమకే అన్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. టికెట్‌ ఇవ్వకపోతే విడతలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ‘ఇచ్ఛాపురం నుంచి సూళ్లూరుపేట వరకు మత్స్యకారులు ఉన్నారు. పార్టీల గెలుపోటములను శాసించగలరు’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బెస్త లక్ష్మీనారాయణ, మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సైకం రాజశేఖర్‌, మల్లేటి రాంబాబు, ఒడుగు నరేంద్ర, బొమ్మిడి గణేశ్‌, శ్రీనివాసరావు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా నిజాంపట్నం జడ్పీటీసీ టీడీపీలో చేరడంతో ప్రభుత్వ పెద్దలు మరింత కలవరపడ్డారు. ఇప్పటికే రేపల్లె వైసీపీ శ్రేణులు రెండుగా చీలిపోవడంతో అక్కడ పాలక పక్షం పరిస్థితి మరింత గందరగోళంలో పడింది. సీఎం జగన్‌ కీలక నేత అయిన మోపిదేవినే వాడుకుని వదిలేశారని.. మున్ముందు తమ పట్ల కూడా ఇలాగే వ్యవహరించరనే గ్యారెంటీ ఏమిటని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మధనపడుతున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 03:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising