‘రుస్తుం’లో మళ్లీ అక్రమ మైనింగ్!
ABN, Publish Date - Dec 22 , 2023 | 02:45 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని రుస్తుం మైన్‌లో అక్రమ తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతనెల 26నుంచి
సోమిరెడ్డి దీక్షతో ఐదు రోజులు బ్రేక్
రెండు రోజుల క్రితమే ఆయనను బలవంతంగా తరలించేసిన పోలీసులు
పొదలకూరు, డిసెంబరు 21: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని రుస్తుం మైన్‌లో అక్రమ తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతనెల 26నుంచి జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ నెల 16నుంచి 19వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీంతో ఐదు రోజుల పాటు మైనింగ్ ఆగింది. 19న పోలీసులు బలవంతంగా సోమిరెడ్డిని తరలించిన విషయం తెలిసిందే. ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి మళ్లీ రుస్తుం మైన్‌లో తవ్వకాలు చేపట్టారు. ఒక హిటాచి వాహనం, మూడు ట్రిప్పర్ల్‌తో క్వార్జ్ట్‌ను బయటికి పంపిస్తున్నారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ అక్రమమా? లేక సక్రమమా? అనేది జిల్లా అధికారులు, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు తదితరులు డిమాండ్ చేశారు.
Updated Date - Dec 22 , 2023 | 02:45 AM