నల్లమలలో చారిత్రక ఆనవాళ్లు
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:01 AM
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అడవిలోని పాలుట్ల గిరిజన గూడెం పోలేరమ్మ గుడి వద్ద ఒక శిలాశాసనం, పులితో వ్యక్తి పోరాడుతున్నట్లు ఉన్న శిల్పం లభ్యమయ్యాయి.
16వ శతాబ్దం నాటి శాసనం, శిల్పం గుర్తింపు
ఎర్రగొండపాలెం, డిసెంబరు 17: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అడవిలోని పాలుట్ల గిరిజన గూడెం పోలేరమ్మ గుడి వద్ద ఒక శిలాశాసనం, పులితో వ్యక్తి పోరాడుతున్నట్లు ఉన్న శిల్పం లభ్యమయ్యాయి. వాటిని పాలుట్ల వీఆర్వో జి.ఆదినారాయణపాటు చారిత్రక పరిశోధకులు తురిమెళ్ల శ్రీనివాసప్రసాద్ ఆదివారం పరిశీలించారు. వీటిని ఫొటోలు తీసి పురావస్తుశాఖ డైరెక్టర్ మునిరత్నానికి పంపించారు. తెలుగు అక్షరాలతో లిఖించిన ఆ శాసనం 16వ శతాబ్దానికి చెందినదిగా ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. ఆ శిలాశాసనం ప్రకారం గురుజాలకు చెందిన లింగబట్టు కుమారుడు జంగం ద్వారా పోలేరమ్మ దేవతకు ఊయల స్తంభాలు (ఊయల కంబాలు) నిర్మించినట్లు తెలుస్తోంది. మరో శిల్పంలో ఇది ఒక వీరుడు పులితో పోరాడుతున్నట్లు సూచిస్తోందని ఆర్కియాలజీ డైరెక్టరు మునిరత్నం నిర్ధారించారు. అక్కడే రాజుల కాలంనాటి గ్రామదేవత పోలేరమ్మ విగ్రహాన్ని కూడా గుర్తించారు.
Updated Date - Dec 18 , 2023 | 03:01 AM