ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఉక్కు’పై దాగుడుమూతలు

ABN, Publish Date - Dec 24 , 2023 | 03:40 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు (ఆర్‌ఐఎన్‌ఎల్‌), జిందాల్‌ స్టీల్‌ పవర్‌ అండ్‌ లిమిటెడ్‌ (జేఎ్‌సపీఎల్‌) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏమిటనేది ఇరు వర్గాలు పూర్తిగా వెల్లడించడం లేదు. విశాఖ స్టీల్‌లో

ఆర్‌ఐఎన్‌ఎల్‌, జిందాల్‌ ఎంఓయూలో దాపరికం

ఇదంతా ప్లాంటు ప్రైవేటీకరణలో భాగమని ఆరోపిస్తున్న కార్మిక సంఘాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు (ఆర్‌ఐఎన్‌ఎల్‌), జిందాల్‌ స్టీల్‌ పవర్‌ అండ్‌ లిమిటెడ్‌ (జేఎ్‌సపీఎల్‌) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏమిటనేది ఇరు వర్గాలు పూర్తిగా వెల్లడించడం లేదు. విశాఖ స్టీల్‌లో మూతపడిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (బీఎ్‌ఫ)-3ని తిరిగి నడిపించడానికి అవసరమైన ముడి పదార్థాలతో పాటు ఆర్థిక సాయం చేస్తామని జేఎ్‌సపీఎల్‌ ఎండీ బిమలేంద్ర ఝా శనివారం ఢిల్లీలో వెల్లడించారు. ఈ విధంగా నెలకు సుమారుగా రూ.800-900 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. ఒడిసాలోని అంగూల్‌లో జేఎ్‌సపీఎల్‌ నిర్మిస్తున్న హాట్‌ స్ట్రిప్‌ మిల్లుకు అవసరమైన లిక్విడ్‌ స్టీల్‌ను నెలకు 90 వేల టన్నులు ఆర్‌ఐఎన్‌ఎల్‌ అందిస్తుందన్నారు. దీనిని శ్లాబులుగా, రోలింగ్‌ కాయిల్స్‌గా మార్చుకుంటామని వివరించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీఎండీ అతుల్‌ భట్‌ ఇదే ఎంఓయూ గురించి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ, బీఎ్‌ఫ-3ని వినియోగంలోకి తీసుకువస్తే నెలకు 2 లక్షల టన్నుల బిల్లెట్లు ఉత్పత్తి అవుతాయని, అందులో 90 వేల టన్నులు జిందాల్‌కు ఇచ్చి, మిగిలిన 1.1 లక్షల టన్నులు మార్కెట్‌లో విక్రయించుకుంటామని చెప్పారు. జిందాల్‌ ఎండీ మాత్రం లిక్విడ్‌ స్టీల్‌ తీసుకుంటామని చెబుతున్నారు. లిక్విడ్‌ స్టీల్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం సాధ్యం కాదు. దీన్నే హాట్‌ మెటల్‌ అంటారు. వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇది పొరపాటున మీద పడితే మనుషుల ఆనవాళ్లు కూడా దొరకవు. దీనిని ఒక ప్లాంటు నుంచి మరో ప్లాంటుకు తరలించడం అసాధ్యం. అంగూల్‌లో ప్రస్తుతం ఉన్న 5.6 మిలియన్‌ టన్నుల ప్లాంటును 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి విస్తరిస్తున్న జిందాల్‌కు ఎండీగా వ్యవహరిస్తున్న బిమలేంద్ర ఝాకు ఆ విషయం తెలియదా? అని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒప్పందంలో ఇతర విషయాలు బయట పెట్టకుండా, తప్పుదోవ పట్టించడానికే ఇలా ఏవేవో చెబుతున్నారని విమర్శిస్తున్నారు.

జిందాల్‌ వ్యూహం ఏమిటంటే..?

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు నుంచి జిందాల్‌ స్టీల్‌ బ్లూమ్స్‌/బిల్లెట్లను తీసుకుంటుంది. వాటిని రోలింగ్‌ మిల్స్‌ ద్వారా అవసరమైన ఉత్పత్తులు తయారు చేసుకుంటుంది. జిందాల్‌కు గల్ఫ్‌లో రోలింగ్‌ మిల్‌ ఉంది. దానికి అవసరమైన బిల్లెట్లు/బ్లూమ్స్‌ను ప్రస్తుతం అంగూల్‌ నుంచి ఎగుమతి చేస్తోంది. ఇకపై విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు వద్ద తీసుకొని ఇటు నుంచి ఇటే గల్ఫ్‌కు పంపుతుంది. దాని వల్ల ఆ సంస్థకు లాజిస్టిక్స్‌ ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతం పారాదీప్‌ పోర్టు నుంచి పంపుతున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 03:40 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising